టీడీపీకి రెడ్డి వర్గం మద్ధతు..ఆ లేడీ లీడర్స్ సత్తా చాటుతారా?

M N Amaleswara rao
వైసీపీకి రెడ్డి వర్గం సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే రాయలసీమలో కావొచ్చు..నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ హవానే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ జిల్లాల్లో రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువ. వారే గెలుపోటములని ప్రభావితం చేయగలరు. గత రెండు ఎన్నికల్లోనూ వారు వైసీపీకి పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే టీడీపీకి సపోర్ట్ ఇచ్చే వారు కూడా ఉన్నారు. కాకపోతే కాస్త తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడుప్పుడే రెడ్డి వర్గంలో కూడా మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయిన కొంతమేర రెడ్లు టీడీపీ వైపు చూసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీలో ఉన్న పలువురు రెడ్డి నేతలు...రెడ్డి వర్గాన్ని టీడీపీకి దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జేసీ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీలు రెడ్డి వర్గాన్ని కాస్త టీడీపీకి చేరువయ్యేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో రెడ్డి వర్గంలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే పలు చోట్ల టీడీపీకి చెందిన రెడ్డి వర్గం నేతలు పికప్ అయినట్లే కనిపిస్తున్నారు.
అయితే టీడీపీలో రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. వారు కూడా పుంజుకోవడానికి చూస్తున్నారు. ముగ్గులు నేతలు కూడా కర్నూలు జిల్లాలోనే ఉన్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, పాణ్యంలో గౌరు చరితా రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మలు ఉన్నారు. ఈ ముగ్గురు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మాత్రం టీడీపీ నుంచి సత్తా చాటాలని చూస్తున్నారు.
ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల అఖిల ఇప్పుడు దూకుడుగా ఉండటం లేదు గానీ..ఆమె బదులు...సోదరుడు విఖ్యాత్ రెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అటు పాణ్యంలో చరితా రెడ్డి పుంజుకోవడానికి చూస్తున్నారు. ఆలూరులో సుజాతమ్మ పికప్ అయ్యారు. మరి చూడాలి ఈ ముగ్గురు రెడ్డి మహిళా నేతలు నెక్స్ట్ సత్తా చాటుతారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: