కే‌ఈ ఫ్యామిలీ కొత్త ట్విస్ట్..కోట్ల ఫ్యామిలీతో కయ్యమేనా?

M N Amaleswara rao
ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబు ఇచ్చిన ఒక్క వార్నింగ్‌తో బయటకొచ్చారు. సరే ఈ రెండున్నర ఏళ్ళు అనేక ఇబ్బందులు వల్ల బయటకు రాని నేతలని బాబు ఏం అనకుండా సైలెంట్‌గానే ఉన్నారు. కానీ కొందరు నేతలు ఇప్పటికీ బయటకు రావడం లేదు. ఇంతకాలం అంటే ఏదో ఇబ్బందులో లేక, జగన్ ప్రభుత్వానికి భయపడి బయటకు రాలేదని అనుకోవచ్చు. కానీ నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది.


అలాగే టీడీపీ కూడా ఇంకా గట్టిగా పోరాడాల్సి ఉంది..లేదంటే పార్టీ మరింత వీక్ అయ్యే పరిస్తితి ఉంది. ఇప్పుడు కాకుండా ఎన్నికల సమయంలో బయటకొస్తామంటే టీడీపీకే నష్టం జరిగేది. అందుకే బాబు ఇప్పటినుంచే పార్టీ నేతలని యాక్టివ్ చేశారు. ఇక నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే యాక్టివ్‌గా లేని నాయకులని పక్కన పెట్టేస్తున్నారు.
దీంతో తమ సీట్లు పోతాయని చెప్పి నేతలు యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏపీలో అందరు టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యారనే చెప్పొచ్చు. ఇక కర్నూలు జిల్లాలో మొన్నటివరకు కనిపించని కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ దూకుడు పెంచింది. డోన్ సీటు చేజారడంతో కే‌ఈ ఫ్యామిలీ బయటకొచ్చింది. మొన్నటివరకు కే‌ఈ ఫ్యామిలీ చేతిలో డోన్, పత్తికొండ సీట్లు ఉన్నాయి. కానీ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి..డోన్ సీటులో కొత్త నాయకుడుని తీసుకొచ్చి పెట్టారు.
దీంతో పత్తికొండలో కే‌ఈ ఫ్యామిలీ యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో తమకు డోన్ సీటు కూడా కావాలని పట్టుబడుతుంది. అది కాకపోతే ఆలూరు సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. అక్కడ కోట్ల సుజాతమ్మ ఇంచార్జ్‌గా ఉన్నారు. అయినా సరే అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని కే‌ఈ ప్రభాకర్ చెబుతున్నారు. దీంతో అక్కడ రచ్చ మొదలైంది. కే‌ఈ, కోట్ల ఫ్యామిలీ గ్రూపుల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అయితే కే‌ఈ ఫ్యామిలీకి ఆలూరు గానీ, డోన్ సీట్లు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. కేవలం పత్తికొండ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: