ధర్మవరంలో ట్విస్ట్‌లు: టిక్కెట్ రేసులో హోరాహోరీ?

M N Amaleswara rao
అనంతపురం జిల్లా ధర్మవరం రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పుడు ఊహించని ఫైట్ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి టార్గెట్‌గా ప్రత్యర్ధులు పావులు కదుపుతున్నారు. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలనే దిశగా పనిచేస్తున్నారు. అయితే ప్రత్యర్ధులు సైతం...టిక్కెట్ కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. అసలు అలా తలపడుతున్న ప్రత్యర్ధులు ఎవరు? ధర్మవరంలో ఈ ట్విస్ట్‌లు ఏంటి? అనే విషయాలని ఒక్కసారి తెలుసుకుంటే...గత ఎన్నికల తర్వాత ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డికి తిరుగులేదనే పరిస్తితి. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉండటంతో...ఆయన బలం ఏ మాత్రం తగ్గడం లేదు.
అదే సమయంలో కేతిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళిపోయారు..దీంతో చంద్రబాబు, పరిటాల శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు అప్పగించారు. మొదట్లో శ్రీరామ్ అంత దూకుడుగా పనిచేయలేదు. కానీ నిదానంగా ఆయన దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. అలాగే కేతిరెడ్డి టార్గెట్‌గా రాజకీయ యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు చేస్తున్నారని, స్థలం అమ్మలన్నా, కొనాలన్నా ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టాల్సిందే అంటూ శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణలని సూరి చేస్తున్నారు...ఇంకా దూకుడుగా పలు ఫోటోలు, వీడియోలు కూడా వేసి చూపిస్తున్నారు. అయితే ఇద్దరు ఇలా కేతిరెడ్డిపై ఫైట్ చేస్తున్నారు. కానీ అదే సమయంలో వీరు టీడీపీ టిక్కెట్ కోసం ఫైట్ చేస్తున్నారు.
సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు..ఇప్పటికే ఆయన అనుచరులు ధర్మవరం సీటు తమదే అంటున్నారు. వారికి శ్రీరామ్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ధర్మవరం సీటు తనదే అని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారు. అయితే సీటు విషయంలో చంద్రబాబు ఇంకా ఏమి తేల్చలేదు. దీంతో ఇద్దరు నేతలు ఎమ్మెల్యే కేతిరెడ్డిపై హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు...అసలు ఇదంతా ధర్మవరం టీడీపీ టిక్కెట్ కోసమే అని అర్ధమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: