చైనాలో కంపెనీ.. అమెరికాలో ఉద్యమాలు?

praveen
చైనా వ్యవహరిస్తున్న తీరుపై అగ్ర రాజ్యమైన అమెరికా గత కొన్ని రోజుల నుంచి ఎంతో ఆగ్రహం తోనే వుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు ఉన్న సమయంలో అమెరికా పెట్టిన ఆంక్షలు చైనాకు ఎంతో ఇబ్బందులు సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 అయితే తర్వాత ఎన్నికల్లో అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తర్వాత చైనాకు సానుకూలంగానే ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బైడెన్ సైతం చైనా ఆటలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే చైనా వీకర్ ముస్లింల హక్కులను కాలరాస్తూ దారుణం గా వ్యవహరిస్తోంది.

 కనీసం మైనారిటీలుగా ఉన్న వీకర్ ముస్లింలను మనుషులుగా కూడా చూడటం లేదు. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇలాంటి నేపథ్యం లో మానవ హక్కులను కాలరాస్తున్న చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ఆంక్షలు విధించింది అన్న విషయం తెలిసిందే. వీకర్ ముస్లిం లను బానిసలుగా మార్చుకుంటూ తయారు చేస్తున్న ఎన్నో రకాల వస్తువుల పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా. అమెరికా నిర్ణయంతో చైనా కు షాక్ తగిలింది అని చెప్పాలి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా అమెరికా కి షాక్ ఇచ్చింది. ఏకంగా చైనాలో తమ బ్రాంచ్ ను స్థాపించేందుకు సిద్ధమయింది టెస్లా.

 దీంతో అమెరికా ప్రభుత్వం ఈ విషయం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.. అంతే కాకుండా అమెరికాకు చెందిన టెస్లా అటు చైనాలో కంపెనీ స్థాపిస్తూ ఉండటం పై అమెరికాలో ఉద్యమాలు కూడా చేపడుతున్నారు. అయితే అమెరికా నిషేధం విధించిన ప్రాంతం లోనే ఇప్పుడు టెస్లా కొత్త బ్రాంచ్ స్థాపించడానికి సిద్ధం కావడం తో అమెరికాలో ఉన్న ఎంతో మంది ఉద్యమ కారులు వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంటూ నిరసనలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: