మోడీ ప్లాన్ రెడీ.. 57 యుద్ధ విమానాలు రాబోతున్నాయి?

praveen
ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఒకవైపు చైనా సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తూ ఉండడం.. అదే సమయంలో భారత్ కూడా మిర్రర్ డిప్లయ్ మేట్ విధానంలో సైనికులు మోహరిస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే భారత్-చైనా సరిహద్దు లో భారీగా సైనికులను మోహరించడమే కాదు ఆయుధాలను కూడా మొహరించాయ్. అదే సమయంలో సరిహద్దుల్లో ఏదో ఒక విధంగా చైనా సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అని భావిస్తున్న భారత ప్రభుత్వం.. భారత ఆర్మీ ని పటిష్టవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

 ఈ క్రమంలోనే అధునాతన టెక్నాలజీతో కూడిన రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుంది భారత్. మరోవైపు భారత తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలు కూడా భారత అమ్ములపొదిలో చేర్చుకుంది. అదే సమయంలో  నూతనమైన క్షిపణి వ్యవస్థను కూడా అటు భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే భారత వాయుసేన ను మరింత పటిష్టవంతంగా మార్చడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు పెడుతోంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది అనేది తెలుస్తుంది.

 అయితే భారత వాయుసేన ను మరింత పటిష్టవంతంగా మార్చడం ఎంతో ముఖ్యం అంటూ భావించిన భారత ప్రభుత్వం ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన 57 యుద్ధ విమానాలు కూడా నౌక నుండి గాల్లోకి ఎగరడం సామర్థ్యాన్ని కలిగిన యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతోందట. తద్వారా వాయుసేన నౌకాదళం కలిపి యుద్ధం చేసే టువంటి అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం  సరిహద్దుల్లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ యుద్ద విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అమెరికా, ఫ్రాన్స్ లలో ఏదో ఒక దేశానికి ఆర్డర్  ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: