అదిరిందెహే.. DRDO మరో అద్భుతం?

praveen
గత కొన్ని నెలల నుంచి భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో ఎంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఆయుధాలను తయారు చేయడంలో కాస్త వెనుకబడినట్లు కనిపించిన భారత రక్షణ పరిశోధన సంస్థ ఇప్పుడు మాత్రం వరుసగా ఆయుధాలను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ప్రభుత్వం నుంచి భారీగా ప్రోత్సాహంతో ఉండటం.. బడ్జెట్లో రక్షణ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడంతో డి ఆర్ డి ఓ శాస్త్రవేత్తలు ఇప్పటికే 10కి పైగా క్షిపణులను తయారుచేసి వాటికి పరీక్షలు నిర్వహించి సక్సెస్ అయ్యారు.

 అదే సమయంలో లైట్ వెయిట్ యుద్ధ విమానం  తేజస్ ను శాస్త్రవేత్తలు తయారుచేశారు అన్న విషయం తెలిసిందే. భారత రక్షణ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలు సైతం ముందుకు వస్తూ ఉండటం గమనార్హం. అయితే భారత్లో ఆయుధ తయారీని మరింత పెంచేందుకు.. భారత ప్రభుత్వం ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ తయారీ సంస్థలను  భారత్లోకి ఆహ్వానిస్తోంది. ఇలాంటి సమయంలోనే డిఆర్డిఓ ఆయా  కంపెనీలతో కలిసి వినూత్నమైన ఆయుధాలను తయారు చేయడానికి ముందుకు సాగుతోంది.

 ఈ క్రమంలోనే ఇటీవల భారత రక్షణ పరిశోధన తయారుచేసిన లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ కు కొనసాగింపుగా ఇక ఇప్పుడు తేజస్ 2 తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఏఎల్, ఎ డి ఎ, డిఆర్ డి వో లు సంయుక్తంగా తేజస్ మార్క్ 2 వర్షన్ ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు drdo తయారుచేసిన లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ కంటే ఇది ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. షార్ట్ లాంగ్ రేంజ్ మిసైల్స్ తో పాటు బ్రహ్మోస్ మిస్సైల్, లేజర్ గైడ్ బాంబులను కూడా ఇది మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ యుద్ధ విమానం తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇది ఒక అద్భుత సృష్టి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: