సీన్ రివర్స్.. సౌదీ మారుతుంది భయ్యో?

praveen
మొన్నటి వరకు ఆయిల్ బావుల కారణంగా లక్షల కోట్లు సంపాదించిన సౌదీ అరేబియాకు ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఊహించని కష్టాలు రాబోతున్నాయి అని అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల  వైపుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చమురు వినియోగం రోజురోజుకు తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ వాహనాల కు స్వస్తి పలికే రోజు ఇంకా ఎన్నో రోజులు లేదు అంటూ అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఇక ఆయిల్ ను నమ్ముకుంటే రానున్నరోజుల్లో ఇబ్బందులు తప్పవు అని భావిస్తున్న సౌదీ అరేబియా  ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది.

 అయితే ప్రస్తుతం తాలిబన్లు పాలన సాగిస్తోన్న ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఇస్లామిక్ చట్టాల అమలులో ఉన్నాయో.. ఇలాంటి ఆంక్షలు అటు  సౌదీ అరేబియా లో కూడా అమలులో ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. అసలు చదువుకో కూడదని మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. ఆంక్షలు అమలులో ఉన్నాయి. అంతేకాకుండా సినిమాలో వినోదం పై కూడా నిషేధం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాలోని పాలకులు కూడా మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌదీలో  ఉన్న కఠిన ఆంక్షలు తొలగిస్తూ ఇక పర్యాటకులు అందరిని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

   టెస్లా ఎలక్ట్రికల్ వాహనాలు తయారీ వేగం పంచుకోవడం.. 2025 కల కనీసం 25% వరకు ఎలక్ట్రికల్ వాహనాలు తోనే మనుగడ సాగించాలని యురోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకోవడం.. 2018లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసిన ప్రకారం చమురు వినియోగం భారీగా పడిపోతుంది అనుగ్రహించిన సౌదీ అరేబియా.. మహిళల్ని ఉద్యోగాలకు చేర్చుకోవడం లాంటివి చేస్తుంది. నిన్నటి వరకు ఇస్లామిక్ విరుద్ధమని చెప్పి మ్యూజిక్ కన్సర్ట్ లకు  ఇప్పుడు మాత్రం అనుమతించారట. సౌదీ అరేబియా విహార కేంద్రంగా మలిచి విదేశీ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇలా సౌదీఅరేబియాలో వస్తున్న మార్పు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: