కేసీఆర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బండి సంజయ్ !

Veldandi Saikiran
లోక్ సభ స్పీకర్ కి బండి సంజయ్ లేఖ రాశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని... శాంతియుతంగా కరీంనగర్ లోని నా క్యాంప్ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తున్న సందర్భంగా నన్ను అరెస్టు చేసిన పోలీసులపై మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాన్నారు.  పార్లమెంట్ సభ్యుడిగా నా అధికారాలను హరించే విధంగా పోలీసులు వ్యవహరించారని...  నా అక్రమ అరెస్టుకు పోలీస్ కమీషనర్ సత్యనారాయణ కారణమని లేఖలో చెప్పారు.  అంతేకాదు అతను నాపై తీవ్ర అనుచిత చర్యలకు పాల్పడి నా హక్కులకు భంగం కలిగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని...  పోలీసులు తనపై  తప్పుడు కేసులు పెట్టారని, చట్టం ప్రకారం నోటీసు  ఇవ్వాల్సిన పోలీసులు చట్టాన్ని యదేచ్ఛగా ఉల్లంఘించారని ఆయన స్పీకర్ కు విన్నవించారు బండి సంజయ్.  పోలీసులు నా కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి నా కార్యాలయంలోని మెష్‌ను మిషన్ తో  కత్తిరించి,  కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి, నన్ను అరెస్టు చేయడానికి ఎటువంటి కారణం చెప్పకుండా  బలవంతంగా ఎత్తుకెళ్లారని స్పీకర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. 

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నెరవేరుస్తూనే బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నేను వ్యవహరిస్తున్న విషయం మీకు తెలుసని, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు మరియు కార్యక్రమాలను నిర్వహించకుండా  అనేక మంది బిజెపి కార్యకర్తలపై తప్పుడు కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడుతోందని మీదృష్టికి తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు.  అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో నం.317 ఉపసంహరించుకోవాలని కోరుతూ నా నియోజకవర్గంలోని నా క్యాంప్ కార్యాలయంలో ఒకరోజు జాగరణ కార్యక్రమానికి పిలుపునిచ్చి  అనుమతి కోసం స్థానిక పోలీసులకు దరఖాస్తు చేసిన వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు.

ఇంతకు ముందు నిరుద్యోగ సమస్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిరసన ప్రదర్శన కోసం అనుమతి కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.  దీంతో రాష్ట్ర కార్యాలయంలోనే నిరసన కార్యక్రమం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి  కొద్ది రోజుల క్రితం ధర్నా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ధర్నా  నిర్వహించారు. ప్రభుత్వం దీక్ష లు చేస్తూ  ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా  వివక్ష చూపుతోందని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: