ఒక ట్రోల్ : బాబోయ్ ఏంట్రా తిట్లు..ఎంతైనా అన్నయ్యరా? జయము జగనన్న!

RATNA KISHORE
"ఈసారి సీఎంగా  కాదు ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌క‌పోవ‌చ్చు"


"వేస్ట్ సీఎం.."


"నీ కొడుకు కోసం భ‌జ‌న చేస్తున్నావా.."


ఇలా చాలా కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో ట్రోల్ అవుతున్నాయి.
అంటే జ‌గ‌న్ పై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. వీటిని అర్థం చేసుకుని త‌ప్పులు దిద్దుకుని, మిగిలిన రెండున్న‌రేళ్లూ స‌జావుగా పాల‌న చేస్తే మంచి నాయ‌కులు అనిపించుకోవ‌డం ఖాయం.కానీ అస‌లు భావం అర్థం చేసుకోకుండా నో టికి ఎంత మాట వ‌స్తే అంత మాట అంటూ, బ‌హిరంగ విమ‌ర్శ‌ల‌కు రాయ‌లేని భాష‌లో దిగుతూ,దిగ‌జారుడు రాజ‌కీయం చేయ డం వైసీపీకి హుందాత‌నం అనిపించుకోదు.అస‌లే బూతులు తిట్టే మంత్రులున్న పార్టీలో నాయ‌కులే కాదు కార్య‌క‌ర్త‌లు కూడా బ‌హిరంగంగానే బూతులు తిడుతూ త‌మ నాయ‌కులే త‌మ‌కు స్ఫూర్తి అని ఒప్పుకుంటున్న నైజం నిజంగానే న‌భూతో!
 
మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం..మీరేమంటారు అంటూ డిప్యూటీ సీఎం దాస‌న్న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఓ ఒపినీయ‌న్ పోల్ కండెక్ట్ చేసింది ఓ యాప్. నిన్న‌టి వేళ డ్వాక్రా బ‌జారు ఓపెనింగ్ కు శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి విచ్చేసి,ఆ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లను ఉద్దేశించి నాలుగు మాట‌లు చెప్పి, ప‌నిలోప‌నిగా ముఖ్య‌మంత్రి గురించి కూడా నాలుగు ప్ర‌శంసాపూర్వ‌క మాట‌లు ప‌లికా రు.చరిత్ర‌లో ఎక్క‌డా లేని విధంగా,ఎవ‌రూ అమ‌లు చేయ‌న‌న్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ జ‌నం మదిలో  ముద్ర వేసిన జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎంగా అధికారాన్ని చేప‌డ‌తార‌ని డిప్యూటీ సీఎం ధ‌ర్మాన అన్న మాట‌లు పెను సంచ‌ల‌నం అయ్యాయి.ఆయ‌న మ‌ళ్లీ సీఎం కాక‌పోతే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అన్నారు.ఇప్పుడీ మాట‌లు విని నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఆ యాప్ లో ప్ర‌స్తావించిన మాట‌లు చ‌దివేక అక్క‌డున్న వారంతా జ‌గ‌న్ ను అన‌రాని మాట‌లు అంటున్నారు. అస‌మ‌ర్థ ముఖ్య‌మం త్రిగా ఆయ‌న‌ను వ్య‌హ‌రిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్క గంట నిడివిలో వెయ్యి కి పైగా కామెంట్లు వ‌స్తే అందులో ఒక‌టో,రెండో మి న‌హా మిగ‌తావ‌న్నీ జ‌గ‌న్ పై నెగిటివ్ కామెంట్లే! ఇవి చ‌దివిన కొంద‌రు వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ ను వ్య‌తిరేకించిన వారిని, ఆయ‌న పాల‌న నచ్చ‌లేదు అన్న వారిని వ్య‌క్తిగ‌తంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. కామెంట్ సెక్ష‌న్ల ద‌గ్గ‌ర కూడా నోటికి వ‌చ్చిన విధంగా బూ తులు తిడుతున్నారు.కొందరినైతే అన‌రాని మాట‌లు రాయ‌డానికి వీల్లేని భాష‌లో అంటున్నారు. అయినా కూడా జ‌గ‌న్ సేన ఎన్ని మాట‌లు అంటున్నా వింటూనే, ప‌డుతూనే, కొంత‌లో కొంత అదుపు త‌ప్ప‌క స‌హ‌నం వ‌హిస్తూనే అధికార పార్టీ నాయ‌కుల‌కు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు త‌మ‌దైన కౌంట‌ర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: