అనుకున్న దానికంటే స్పీడ్ గా వచ్చేసిన న్యూ ఇయర్..!

NAGARJUNA NAKKA
2022వ సంవత్సరం ముందుగా రావడం ఏంటి..? 365రోజులు పూర్తయ్యాకే వస్తోంది కదా అని అనకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. భూమి తిరిగే వేగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా ఈ సారి 2022 సాధారణ సమయం కంటే 65మిల్లీ సెకన్ల ముందుగా వచ్చేసింది. ఇక అన్ని టైమ్ జోన్లలో నూతన సంవత్సరం రావడానికి మొత్తం 26గంటల సమయం పట్టింది.
న్యూజిలాండ్ లో 2022 ప్రారంభమైంది. భారత కాలమాన ప్రకారం.. 31వ తేదీ సాయంత్రం 4.30గంటలకు ఆ దేశం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆక్లాండ్ లోని స్కై టవర్ వెలుగులీనుతూ కనిపించింది. అటు టవర్ సమీపంలో ఆకాశంలో బాణా సంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఇక భారత కాలమాన ప్రకారం 31వ తేదీ సాయంత్రం 6.30గంటలకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్, కాన్ బెర్రాలో 2022మొదలైంది. ఇక అదే రోజు రాత్రి 8.30కి జపాన్ లో 9.30గంటలకు చైనాలో నూతన సంవత్సరం ఆరంభమైంది.
ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు ఆకాశాన్నంటాయి. సిడ్నీ హార్బర్ దగ్గర పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చి.. అక్కడి ప్రజలు కొతత సంవత్సరానికి స్వాగతం పలికారు. మిరుమిట్లు గొలిపే వెలుతురులో డీజే సౌండ్ లు, ర్యాప్ మ్యూజిక్ లతో సందడి చేశారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సందడి అంబరాన్నంటింది. దేశ ప్రజలు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి.. కేకులు కట్ చేసి కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. చిన్నాపెద్దా లేకుండా అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంజాయ్ చేశారు. అయితే  అందరూ 12గంటలకు ఒకేసారి వాట్సాఫ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియాలో విషెస్ చెప్పేందుకు మెసేజ్ లు చేయడంతో కొద్దిసేపు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.  
ఇక న్యూఇయర్ సందర్భంగా మీ ఆప్తులకు ఏం గిఫ్ట్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా..? అయితే మన దగ్గర గతేడాది మొదలైన కరోనా మహమ్మారి బెడద ఇంకా తగ్గలేదు. కొవిడ్ నియంత్రణ కోసం అనేక జాగ్రత్తలు పాటిస్తున్నాం. కాబట్టి మీ స్నేహితులు, బంధువులకు ఈ సారి న్యూ ఇయర్ కానుకగా శానిటైజర్స్, వైప్స్, శానిటైజింగ్ టూల్స్, సర్ఫేస్ డిసిన్పెక్టెంట్ లాంటివి బహుమతిగా ఇవ్వండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: