ఓరి నాయనో.. టెస్లాను తలదన్నే కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే?

praveen
అన్ని రంగాల్లో ఎప్పుడూ ట్రెండ్ మారుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతున్న ట్రెండ్ ను ఫాలో అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు జనాలు. ఈ క్రమంలోనే ఒకప్పుడు డీజిల్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత పెట్రోల్ వాహనాల ట్రెండ్ నడిచింది. ఇక ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు ట్రెండ్ దిశగా దూసుకుపోతుంది ప్రపంచం. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. అదే సమయంలో కొన్ని దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో చాలామంది  ఎలక్ట్రికల్ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం.

 ఇక మరోవైపు కార్లు బైక్ తయారీ కంపెనీలు సైతం వినూత్నమైన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయ్. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఎలక్ట్రికల్ వాహనాలకు పెట్టింది పేరుగా కొనసాగుతోంది టెస్లా సంస్థ. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ఎలక్ట్రికల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఎంతో మంది టెల్సాకు సంబంధించిన ఎలక్ట్రికల్ కార్లను కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. కానీ ఇప్పుడు ఏకంగా టెస్లా కంపెనీ కార్ లనే తలదన్నే విధంగా కొత్త కారు మార్కెట్లోకి రాబోతోంది అని తెలుస్తోంది.

 చైనా కు సంబంధించిన హువాయి కంపెనీ సెన్సేషనల్ ఎలక్ట్రికల్ కార్డు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల మేర ప్రయాణించిన కార్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది హూవాయి కంపెనీ. ఇటీవలే ఎన్నో దేశాల్లో ప్రతికూలతలు ఎదురైన తర్వాత మళ్లీ పునరాగమనం చేసేందుకు ఈ వినూత్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఐటో m5 పేరుతో కొత్త కార్ మార్కెట్ లోకి తీసుకు రాబోతుంది. కార్ లో డబుల్ లేయర్ సౌండ్ ప్రూఫ్ క్లాస్ ఉంటుంది. అంతే కాకుండా 200 కే డబ్ల్యు హెచ్ బ్యాటరీలతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే వెయ్యి కిలోమీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. హైబ్రిడ్ కారు కావడంతో ఛార్జింగ్ జీరో అయినా కూడా నిర్విరామంగా ప్రయాణించవచ్చట. విద్యుత్, ఇందనంతో రెండింటితో ఈ కారు నడుస్తుందట. ఇక ఈ కారు ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం 29,45,915  రూపాయలు. అదేసమయంలో టెల్సా వై మోడల్ ధర 33 లక్షల 7,800 రూపాయలు. ఇలా టెస్లా కంటే తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో హువాయ్ కంపెనీ కార్ తీసుకువచ్చి చరిత్ర సృష్టించబోతుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: