ఆ యువ మంత్రికి చెక్ పెట్టడానికి బాబు కొత్త ఎత్తు?

M N Amaleswara rao
ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనే టార్గెట్‌ పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో బాబుకు చావో రేవో లాంటివి..ఎందుకంటే ఈ సారి గాని ఓడిపోతే టీడీపీ ఫ్యూచర్ మాత్రమే కాదు చంద్రబాబు ఫ్యూచర్ కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే బాబుకు చివరి ఛాన్స్ అన్నట్లు పోరాడుతున్నారు. అందుకే టీడీపీలో వ్యూహాత్మక మార్పులు చేస్తూ వస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా వైసీపీకి బలమైన నాయకులని పెట్టుకుంటూ వస్తున్నారు. ఎలాగైనా వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలనే కోణంలో బలమైన నాయకులని పార్టీకి ఇంచార్జ్‌లుగా పెడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని ఆత్మకూరు నియోజకవర్గంపై బాబు ఫోకస్ చేశారు. ఆత్మకూరులో యువ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పనిచేస్తున్న విషయం తెలిసిందే.
అసలు ఇక్కడ గౌతంరెడ్డికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదనే చెప్పాలి. మామూలుగానే ఆత్మకూరులో టీడీపీకి పట్టు లేదు. కేవలం ఇక్కడ రెండుసార్లు మాత్రమే గెలిచింది. అసలు చివరిగా 1994 ఎన్నికల్లో గెలిచింది. అంటే అప్పుడు నుంచి ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగరలేదు. పైగా ఇప్పుడు అక్కడ మంత్రి మేకపాటి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇలా స్ట్రాంగ్‌గా ఉన్న మంత్రికి ప్రత్యర్ధిగా టీడీపీలో నాయకుడు లేరు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున బొల్లినేని కృష్ణయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కృష్ణయ్య అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడు లేరు.
ఈ క్రమంలోనే మేకపాటికి పోటీగా బలమైన నాయకుడుని పెట్టాలని బాబు చూస్తున్నారు. ఆత్మకూరు ఇంచార్జ్ పదవి కోసం కన్నబాబు, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్లని పరిశీలిస్తున్నారు. ఆత్మకూరులో రెడ్డి వర్గం హవా ఎక్కువ కాబట్టి కమ్మ వర్గానికి చెందిన కన్నబాబు కంటే...రెడ్డి వర్గానికి చెందిన బొమ్మిరెడ్డికే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బొమ్మిరెడ్డికే ఆత్మకూరు ఇంచార్జ్ పదవి దక్కవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: