కాకినాడలో తమ్ముళ్ళ పోరు..రాజప్ప సైలెంట్‌గా సెట్ చేస్తున్నారా..?

VUYYURU SUBHASH
కాకినాడ రూరల్‌ తెలుగుదేశం పార్టీలో కనబడని ఆధిపత్య పోరు ఉందనే చెప్పాలి. ఇక్కడ నాయకులు గ్రూపులుగా ఏర్పడి పార్టీకి కాస్త నష్టం చేస్తున్నట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత నుంచే ఇక్కడ అసలు రచ్చ మొదలైనట్లు  ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కన్నబాబు, టీడీపీ నుంచి పిల్లి అనంతలక్ష్మీలు పోటీ చేశారు. అయితే రాష్ట్రంలో వైసీపీ గాలి వీచిన కాకినాడ రూరల్‌లో అంతగా వీయలేదనే చెప్పాలి.

కన్నబాబు చాలా తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి బయటపడ్డారు. ఒకవేళ జనసేన ఓట్లు చీల్చకుండా ఉంటే కన్నబాబుకు చెక్ పడిపోయేది. అయితే ఎలాగైతే ఏముంది కన్నబాబు గెలిచి  మంత్రిగా దూసుకుపోతున్నారు. కానీ టీడీపీ పరిస్తితే ఘోరంగా ఉంది. ఇక్కడ నిలకడ లేని రాజకీయం చేస్తున్నారు. అసలు ఓడిపోయిన దగ్గర నుంచి పిల్లి అనంత లక్ష్మీ, ఆమె భర్త సత్తిబాబులు అనుకున్న స్థాయిలో పార్టీ కోసం పనిచేయలేదు. గత రెండున్నర ఏళ్లుగా పార్టీని గాలికొదిలేశారు.

ఇక మధ్యలో సడన్‌గా ప్రెస్ మీట్ పెట్టి...టీడీపీలో పదవులకు రాజీనామా చేస్తున్నామని, ఇంకా పోటీకి దిగమని చెప్పి పిల్లి దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. అయితే పరోక్షంగా మాజీ మంత్రి చినరాజప్ప, పిల్లి దంపతులకు చెక్ పెట్టినట్లు కథనాలు వచ్చాయి. వారిని సైడ్ చేయడానికే రాజప్ప ట్రై చేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో కాపు వర్గానికే ప్రాధాన్యత దక్కేలా చేశారని, అందుకే పిల్లి దంపతులు సైడ్ అయ్యారని టాక్.

కానీ ఏది ఎలా జరిగినా పిల్ల దంపతులు సైడ్ అవ్వడంతో టీడీపీ అధిష్టానం కొత్త నాయకుడు కోసం వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మళ్ళీ పిల్లి దంపతులు యాక్టివ్ అయ్యారు. ఇంచార్జ్ పదవి తమకే ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కకింద రూరల్‌లో మెజారిటీ నాయకులు పిల్లి దంపతులు వైపు లేరు. దీంతో వారి పరిస్తితి దారుణంగా తయారైంది. మరి త్వరలోనే రూరల్‌కు కొత్త నాయకుడుని పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: