కన్నబాబు-మేకపాటి ప్రత్యర్ధుల మార్పు ఖాయమేనా...?

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీలో వేగమైన మార్పులు జరుగుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఇప్పటినుంచే గెలుపు గుర్రాలని రెడీ చేస్తున్నారు. ఎక్కడకక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ..క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకుంటూ...పార్టీ నాయకుల పనితీరుని పరిశీలిస్తూ..అవసరమైన చోట్ల మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు....ఇదే క్రమంలో కాకినాడ రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

ఈ రెండు చోట్ల అపోజిట్‌లో బలమైన మంత్రులు పనిచేస్తున్నారు. కాకినాడ రూరల్‌లో కన్నబాబు ఉండగా, ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు బడా నాయకులని ఓడించాలంటే టీడీపీలో ఇంకా బలమైన నాయకులు ఉండాలి. అందుకే ఆ దిశగా చంద్రబాబు పనిచేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కాకినాడ రూరల్‌లో టీడీపీ తరుపున పిల్లి అనంతలక్ష్మీ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆమె నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మధ్యలో తన భర్త సత్తిబాబుతో కలిసి పార్టీకి దూరం జరిగారు.

దీంతో కాకినాడ రూరల్‌లో టీడీపీ పరిస్తితి ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడ మరో బలమైన నాయకుడుని పెట్టడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పిల్లి దంపతులు మళ్ళీ యాక్టివ్ అయ్యి..ఇంచార్జ్ పదవి కోసం ట్రై చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నేతలు...పిల్లి దంపతులకు సీటు ఇవ్వొద్దని కోరుతున్నారు. దీంతో పిల్లి దంపతుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది. అయితే పరిస్తితులని బట్టి మళ్ళీ ఒకసారి అందరితో మాట్లాడి నియోజకవర్గ ఇంచార్జ్‌ని పెడతానని చంద్రబాబు చెప్పారు.

ఇటు ఆత్మకూరులో మంత్రి మేకపాటి ప్రత్యర్ధిగా ఉన్న బొల్లినేని కృష్ణయ్య పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో ఆత్మకూరులో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది. అసలే అక్కడ పార్టీ అంతంత మాత్రమే..పైగా నాయకుడు కూడా లేకపోవడంతో దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే అక్కడ కూడా కొత్త నాయకుడుని దింపడానికి బాబు సిద్ధమయ్యారు. మేకపాటికి ధీటైన అభ్యర్ధిని పెట్టడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: