కల్యాణ్ వర్సెస్ కొడాలి: గుడివాడలో తేల్చుకుంటారా?

M N Amaleswara rao
పవన్ కల్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే అంత క్రేజ్ ఉన్న పవన్..రాజకీయాల్లో కాస్త ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అసలు ఆయనని ప్రత్యర్ధులు మరీ తీసి పారేసినట్లు మాట్లాడుతున్నారు. పవన్‌కు జనం సపోర్ట్ లేదనే కోణంలో విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి చూస్తే...సినిమాల్లో ఉన్నంత క్రేజ్...రాజకీయాల్లో లేదని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకు ప్రజా మద్ధతు పెద్దగా లేదని గత ఎన్నికల్లోనే రుజువైంది. పైగా పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోవడంతో పవన్ పరువు పోయినట్లే అయింది.
అక్కడ నుంచి ఆయన్ని ప్రత్యర్ధులు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వస్తున్నారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీలో కొందరు మంత్రులైతే పవన్‌పై సెటైర్లు వేస్తూనే ఉంటారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు లాంటి వారు...పవన్‌ని విమర్శిస్తూనే ఉంటారు. ఇక తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంపై కాకుండా వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.
ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం చేయాలంటూ పవన్ చెబుతున్నారు. ఇక తాము చేసేది ఏదో చేస్తున్నామని, పవన్ తమకు ఏమి ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదని, ఆయన సలహాలకో దండం అని, అయినా ఏపీలో ఆయనకు అంత సీన్ లేదని, గాజు గ్లాసు ఎప్పుడో పగిలిపోయిందని కొడాలి మాట్లాడారు.
దీనికి కౌంటరుగా జనసైనికులు స్పందిస్తూ...గాజు గ్లాస్ పగిలిందో లేదో వచ్చే ఎన్నికల్లో గుడివాడలో తెలుస్తుందని, తమకు గెలిచే సత్తా లేకపోవచ్చు గానీ...ఓడించే సత్తా ఉందని జనసేన కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అయితే గుడివాడలో పవన్ అభిమానులు కాస్త ఎక్కువగానే ఉన్నారు..ఇంతవరకు వారు కొడాలికే సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది కాబట్టి..నెక్స్ట్ ఎన్నికల్లో వారు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తుయిన్నాయి. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించిన గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం అంత ఈజీ కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: