రాయలసీమ: జిల్లాను ‘కోట్ల’ డిస్ట్రబ్ చేస్తున్నాారా ?

Vijaya


కర్నూలు జిల్లాలో సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పెడుతున్న చిచ్చు మామూలుగా లేదు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా  కర్నూలు పార్లమెంటుకు పోటీచేసిన కోట్ల ఓడిపోయారు. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కోట్లకు ఏమైందో ఏమో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. యాక్టివ్ అవ్వటం కూడా ఇతర నియోజకవర్గాల్లో చొచ్చుకెళ్ళిపోతున్నారు. దాంతో పొరుగునే ఉన్న డోన్, ఎమ్మిగనూరు, ఆలూరులోని పార్టీ నేతల్లో గందరగోళం మొదలైపోయింది.



ఇంతకీ విషయం ఏమిటంటే ఇంతకాలం కర్నూలుకు మాత్రమే పరిమితమైన కోట్ల తాజాగా ఎమ్మిగనూరులో ఆఫీసును తెరిచారు.  తన నియోజకవర్గంలో కోట్ల ఆఫీసు తెరవటంతో  మాజీ ఎంఎల్ఏ బీవీ జయనాగేశ్వరరెడ్డిలో అభద్రత మొదలైంది. ఇదే విషయాన్ని కోట్లను అడిగితే ఎవరెక్కడైనా ఆఫీసును ఓపెన్ చేయచ్చని చెప్పారట. దాంతో మాజీ ఎంఎల్ఏకి ఏమి చేయాలో తోచటంలేదు. ఇదే సమయంలో బీవీ అంటేపడని వర్గం కోట్లతో చేతులు కలిపింది. దాంతో బీవీలో టెన్షన్ మొదలైంది.



ఇదే పద్దతిలో డోన్, ఆలూరులో కూడా ఆఫీసులు మొదలుపెట్టారు. డోన్ లో కేఈ ప్రతాప్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ అక్కడ కూడా కోట్ల భార్య, మాజీ ఎంఎల్ఏ సుజాతమ్మ రెగ్యులర్ గా తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సుజాతమ్మ డోన్ నుండే పోటీ చేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. అయితే డోన్ నుండి పోటీచేసేందుకు సుజాతమ్మ సుముఖంగా లేరనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కోట్ల కుటుంబం ఇపుడు డోన్ లో కూడా తిరుగుతుండటంతో అక్కడా కేఈ వర్గంలో టెన్షన్ మొదలైంది.



ఇక పోయిన ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో ఓడిపోయిన వీరభద్రగౌడ్ ను కాదని సుజాతమ్మ, మాజీ ఎంఎల్ఏ కేఈ ప్రభాకర్ తిరుగుతున్నారు. ఈనెల 8వ తేదీన ఆలూరులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో ఆలూరులో కానీ లేదా కర్నూలులో కానీ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.



మరుసటి రోజే నియోజకవర్గంలో పర్యటించిన సుజాతమ్మ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోయేది తానే అంటు ప్రకటించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చినట్లు కూడా ఈమె చెప్పుకుంటున్నారు. వీళ్ళద్దరి ప్రకటనలతో వీరభద్రగౌడ్ కూడా యాక్టివ్ అయ్యారు. మొత్తానికి వివిధ నియోజకవర్గాల్లో కోట్ల పెట్టిన చిచ్చు మెల్లిగా రాజుకుంటోంది. జిల్లాలో పార్టీ పరిస్ధితి అంతంతమాత్రంగా ఉంది. చివరకు ఏమవుతుందో ఏమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: