విజ‌య‌మ్మ ఆ ఒక్క కోరిక తీర‌లేదే..?

VUYYURU SUBHASH
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భార్యగా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లిగా ఉన్న వైఎస్ విజయలక్ష్మి ముందు నుంచి గృహిణిగా ఉన్నారు. తన భర్త వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వస్తున్నారు. వైయస్సార్ ఫ్యామిలీ పులివెందుల నుంచి తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. సమైక్యాంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి పెరిగింది. అయితే ఏనాడూ కూడా వైఎస్ విజయలక్ష్మి మాత్రం భర్త చాటు భార్య‌గానే ఉన్నారు తప్ప ఎప్పుడు ప్రజల ముందుకు రాలేదు.
ఆమెకు తన భర్త... తన పిల్లలు... తన లోకం. అలాగే విజయలక్ష్మి బ్రతికారు. ఎప్పుడు అయితే భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి హఠాన్మరణం చెందారో... అప్పుడు ఆమె బయటకు రాక తప్పలేదు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా గెలిచారు. ఆ తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
ఈ క్రమంలోనే 2011 ఉపఎన్నికల్లో ఆమె పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ తరఫున గెలిచిన తొలి మ‌హిళా ఎమ్మెల్యే కూడా విజయలక్ష్మి కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి మహిళా ఎమ్మెల్యే గా కూడా ఆమె ఎప్పటికీ రికార్డుల్లో నిలిచిపోయారు. అయితే 2014 ఎన్నికల సమయంలో జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఈ క్రమంలోనే విజయలక్ష్మి ని విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఆమె బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో 90 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. అయితే తన తల్లిని తర్వాత ఎంపీని చేయాలన్న కోరిక జగన్ కు ఉన్నా విజయలక్ష్మి ఆసక్తి చూపించకపోవడం తో ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: