పులివెందుల పోరు: ఈ సారి ‘లక్ష’ టార్గెట్?

M N Amaleswara rao
పులివెందుల నియోజకవర్గం...అసలు ఈ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి...ఎందుకంటే ఇది వైఎస్సార్ అడ్డా...ఇక వైఎస్సార్ అడ్డా అన్నాక..ఇక్కడ కొత్తగా ఏమి జరగదు...కేవలం వైఎస్సార్ ఫ్యామిలీకి వన్‌సైడ్‌గా విజయాలు రావడం తప్ప. 1978 నుంచి 2019 వరకు చూసుకుంటే పులివెందులలో ఎలాంటి విజయాలు దక్కాయో అందరికీ తెలిసిందే. ఇక భవిష్యత్‌లో కూడా జగన్‌కు ఎలాంటి విజయాలు దక్కుతాయో చెప్పాల్సిన పని లేదు.
అయితే ఇక్కడ వైఎస్సార్ ఫ్యామిలీ మెజారిటీ తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ వైఎస్సార్ ఫ్యామిలీ మెజారిటీ పెరుగుతుంది తప్ప..తగ్గడం లేదు. ఇక గత రెండు పర్యాయాలు నుంచి జగన్ మెజారిటీ ఏ విధంగా పెరుగుతుందో వచ్చిందో కూడా తెలిసిందే. అసలు ఇక్కడ జగన్‌కు రెండుసార్లు భారీ మెజారిటీనే వచ్చింది. 2014 ఎన్నికల్లో 75 వేల ఓట్ల మెజారిటీ వస్తే...2019 ఎన్నికల్లో 90 వేల మెజారిటీ వచ్చింది. అంటే మెజారిటీ పెరుగుతూ వస్తుందనే విషయం అర్ధమవుతుంది.
రాను రాను పులివెందుల ప్రజలు వన్‌సైడ్‌గా జగన్‌కు ఓట్లు వేస్తూ వస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు...జగన్‌కు ఇంకెంత మెజారిటీ ఇస్తారంటే...ఈ సారి కూడా భారీ మెజారిటీనే కట్టబెట్టేలా ఉన్నారు. పైగా టీడీపీకి ఇప్పుడు సరైన నాయకుడు కూడా లేరు. గత రెండు దశాబ్దాల నుంచి టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయన ఓడిపోయినా సరే...కాస్త మంచిగానే ఓట్లు తెచ్చుకునేవారు. ఆయనకంటూ పులివెందులలో కాస్త ఫాలోయింగ్ ఉంది.
కానీ ఇప్పుడు ఆ నాయకుడు టీడీపీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పులివెందుల టీడీపీ ఇంచార్జ్‌గా బీటెక్ రవి ఉన్నారు...అయితే రవికి పెద్దగా ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. అలాంటప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ మెజారిటీ లక్ష దాటిన ఆశ్చర్యపోనక్కరలేదు. చూడాలి మరి జగన్ మెజారిటీ ఈ సారి లక్ష టార్గెట్ రీచ్ అవుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: