ఆ ఫ్యామిలీలకు సెట్...కానీ భూమా ఫ్యామిలికే డౌట్...?

VUYYURU SUBHASH
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది...గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పార్టీ బయటపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో బలపడకపోయినా కొంత మేర టీడీపీ పరిస్తితి మెరుగైందని చెప్పొచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలపడింది. అలాగే టీడీపీలో ఉండే బడా ఫ్యామిలీలు సైతం కొంతవరకు పికప్ అయ్యాయి. కానీ కొందరు మాత్రం ఇంకా పుంజుకున్నట్లు కనిపించడం లేదు.

సీమలో పరిటాల, జేసీ, కోట్ల ఫ్యామిలీలు కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తున్నాయి. కానీ భూమా ఫ్యామిలీకే ఇంకా టైమ్ కలిసి రానుట్లుంది. ఎన్నికల తర్వాత త్వరగా పికప్ అయింది..జేసీ ఫ్యామిలీనే. తాడిపత్రిలో ఆ ఫ్యామిలీ దూసుకెళుతుంది. ఇటు అనంతపురం పార్లమెంట్ పరిధిలో జేసీ పవన్‌కు కూడా కాస్త పాజిటివ్ కనబడుతోంది. అలాగే పరిటాల ఫ్యామిలీకి రాప్తాడు నియోజకవర్గంలో కాస్త పరిస్తితి మెరుగైందనే చెప్పాలి.

అటు వస్తే కర్నూలులో కోట్ల ఫ్యామిలీ చాలా వరకు పుంజుకుంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కాస్త అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అలాగే ఆలూరు అసెంబ్లీలో కోట్ల సుజాతమ్మ పికప్ అయ్యారు. ఇలా బడా ఫ్యామిలీ లు బాగానే పుంజుకున్నాయి. భూమా ఫ్యామిలీనే ఇంకా వెనుకబడి ఉంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ఆ ఫ్యామిలీకి అంత అనుకూలమై న వాతావరణం మాత్రం కనిపించడం లేదు. భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిలు పికప్ అయినట్లు లేరు.

కాకపోతే వీరు నియోజకవర్గంలో యాక్టివ్‌గానే ఉంటున్నారు..కానీ వైసీపీని డీకొట్టే స్థాయికి రాలేక పోతున్నారు. రెండుచోట్ల వైసీపీ స్ట్రాంగ్‌గా నే కనిపిస్తోంది. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. పైగా రెండు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ కూడా ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. దీనికి తోడు అధికారంలో ఉండటంతో..రెండు చోట్ల భూమా ఫ్యామిలీ పుంజుకోవడానికి అవకాశాలు దొరకడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లోపైన భూమా ఫ్యామిలీ పికప్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: