అదిరిందిపో.. విమాన సేవలు.. ఇప్పుడు రైళ్లల్లో?

praveen
సాధారణంగా విమానంలో ప్రయాణికులకు ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. అయితే కేవలం విమానంలో ప్రయాణించిన వారికి మాత్రమే కాదు విమానంలో ప్రయాణించే వారికి సైతం ఒకవేళ విమాన ప్రయాణం చేస్తే ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక విమానంలో సర్వీసులు చేయడానికి ఎవరు ఉంటారు అన్న విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా అందరూ సినిమాల్లో చూసే ఉంటారు. ప్రయాణికుడు విమానంలో ఎక్కిన తర్వాత ప్రయాణికుడికి కావలసిన అన్ని రకాల ఆహారం పానీయాలు కూడా అందించడానికి అటు ఎయిర్ హోస్టస్ లు సేవలు చేస్తూ ఉంటారు.

 అంతేకాదు ఇక ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు . అయితే ఇప్పటి వరకు విమానాల్లో సేవలుచేసిన ఎయిర్ హోస్టెస్ లు అటు రైళ్లల్లో కూడా సేవ చేస్తే ఎలా ఉంటుంది. రైళ్లల్లో హోస్టెస్ సేవలు చేస్తే బాగానే ఉంటుంది కానీ.. అలా చేయడం అస్సలు కుదరదు అని అంటారు ఎవరైనా. కానీ ఇలాంటిదే మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. అచ్చం విమానంలో పొందిన సేవలనే అటు రైళ్లల్లో కూడా పొందే అవకాశం మరికొన్ని రోజుల్లో రాబోతుంది. విమానంలో ఎయిర్ హోస్టెస్ అందించే సేవలను అటు రైళ్లల్లో  ప్రయాణికులు కూడా మరికొన్ని రోజుల్లో పొందుతున్నారు.


 ఇటీవలే రైళ్లలో ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు  ప్రయాణాలు ఎంతో సురక్షితంగా జరిగేందుకు రైల్వే శాఖ  వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే వందే భారత్,గతిమాన్, తేజస్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల కోసం స్పెషల్ గా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఈ మూడు ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా త్వరలో హోస్టస్  సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. సుదూర ప్రీమియం రైళ్లలో హోస్టస్  సేవలు ఉండమని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే రాత్రిపూట సేవలు అందించేందుకు హోస్టెస్ లు అందుబాటులో ఉండరని ఇక రైల్వే అధికారి చెప్పుకొచ్చారు. కేవలం నిర్ణీత సమయంలో మాత్రమే ఇక రైళ్లలో హోస్టెస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: