చింతపండు రాజకీయం : వచ్చీ రాని హిందీ ఎందుకు మల్లన్నా!

RATNA KISHORE
క్యూ టీవీ ఓనర్ తీన్మార్ మల్లన్న
బీజేపీలో చేరాక వార్తల్లో నిలిచారు
అనూహ్య రీతిలో ఆ పార్టీలో చేరిన
ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో
వైరల్ అవుతున్నాయి.
సగం హిందీ సగం తెలుగులో పలికిన
మాటలు ట్రోలింగ్ కు కారణం అయ్యాయి.


భాష ఏదయినా కానీ పలికే తీరు, దానిని పలికించిన సందర్భం అన్నవి చాలా ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సక్సెస్ కు ప్రధాన కారణం భాషే! ఇవాళ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్న నేతలకు ప్రధాన ఆయుధం కూడా భాషే! శ్రీకాకుళం మొదలుకుని నెల్లూరు దాకా, హైద్రాబాద్ మొదలుకుని హస్తిన పురి దాకా ఓ నాయకుడు రాణించాలంటే అందుకు  తగ్గ భాషా సంపత్తి, విషయ సంపత్తి అన్నది ఎంతో ముఖ్యం. వచ్చీ రాని భాషతో మాట్లాడితే జనం ఊరుకోరు. నవ్వుకుంటూ హేళన చేస్తారు. ఇదే కోవలో ప్రతిరోజూ ఉదయం పూట యూ ట్యూబ్ లో కేసీఆర్ కుటుంబాన్ని తిట్టే  మీడియా ప్రతినిధి మల్లన్న నిన్నటి వేళ ఢిల్లీలో బీజేపీలో చేరిపోయాక, యథావిధిగా చెప్పాలనుకున్న మాటలు హిందీలో చెప్పలేక తడబడ్డారు.  తప్పులు మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు.


బీజేపీలో చేరిపోయారు మల్లన్నా. మామూలుగా కాదులేండి ఓ రేంజ్ లో  కేసీఆర్ కుటుంబాన్ని  ఆడుకున్నారు. అంతటి పద సంపద అంతటి పద సౌష్టవత ఇంకెవ్వరిలోనూ చూడలేం. ఇంకెవ్వరితోనూ పోల్చలేం. ఆ కారణంగానో అకారణంగానో మనం ఆయనను ఓ సారి తల్చుకోవాలి. ఆ విధంగా ఆయన వెనుకకో ముందుకో  పోయి ఉండాలి. ఢిల్లీలో కాషాయం కండువా కప్పుకున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తనకు రాని హిందీ భాషను తనకు వచ్చిన తెలుగును కలిపి స్పీచులో దంచేశారు. ఇది విని అంతా నవ్వుకుంటున్నారు. భాష రాకపోతే పర్లేదు ఎందుకని వచ్చీ రాని భాష మాట్లాడి అభాసు పాలుకావడం అని హితవు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబాన్ని తాను అమరుల స్థూపానికి కట్టేస్తానని ప్రగల్బాలు పలికి తరువాత అనేక వివాదాలకు ఆయన కారణం అయ్యారు. వాస్తవానికి మల్లన్న సత్తా ఏంటో మల్లన్నకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే! ఆయన కేసీఆర్ పై సాధించే విజయ ఎంతన్నది కూడా  ఎరుకే! అయినప్పటికీ మల్లన్న బీరాలు తగ్గవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: