జ‌గ‌న్ కేబినెట్లో 18 మంది మంత్రులు అవుట్...?

VUYYURU SUBHASH
ఏపీ మంత్రివర్గంలో మార్పులు అంశంలో ఇప్పటికే పలు రకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ మొదట్లో చెప్పినట్లుగా....రెండున్నర ఏళ్ళు అయిపోయాయి. అంటే ఈ డిసెంబర్‌లోనే మంత్రివర్గంలో మార్పులు చేయాలి. అయితే కోవిడ్ వల్ల చాలా సమయం పోయింది కాబట్టి...మంత్రులకు ఇంకో ఆరు నెలల సమయం పెంచినట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే రానున్న వేసవిలో మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది.

తాజాగా మంత్రివర్గం గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. మొన్నటివరకు 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరిగింది...కానీ 100 శాతం జరగదని తెలిసింది. కొందరు సీనియర్లని ఐదేళ్ల పాటు కంటిన్యూ చేయాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులని మారిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బుగ్గన, పెద్దిరెడ్డి, బొత్స లాంటి వారిని మార్చడం సులువు కాదని తెలుస్తోంది.

అయితే ఖచ్చితంగా 15 నుంచి 18 మంత్రులు క్యాబినెట్ నుంచి తప్పుకుంటారని తెలిసింది. మొత్తం క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు...ఇందులో 7-10 మంది మంత్రులు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మంత్రులు తప్పుకోవాల్సిందే అని సమాచారం. పైగా రాబోయే బడ్జెట్ సమావేశాల ముందు మంత్రివర్గంలో మార్పులు జరగొచ్చని ప్రచారం మొదలైంది. అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విష‌యం ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక మంత్రివర్గంలో కంటిన్యూ అయ్యే వారిలో సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణలు ఉంటారని తెలుస్తోంది. అటు మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు లాంటి వారు కూడా మంత్రివర్గంలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కొత్తగా మంత్రివర్గంలోకి రావడానికి చాలామంది ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు. మరి వారిలో సీఎం జగన్ ఎవరికి బంపర్ ఆఫర్ ఇస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: