crash : రాజశేఖరరెడ్డికి.. కళాశాల నుండే రాజకీయ ఆసక్తి..!

Chandrasekhar Reddy
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి కళాశాల నుండే రాజకీయ ఆసక్తి ఉన్నది. ఆ ఆసక్తితోనే వైద్య వృత్తితో ప్రజాసేవ చేస్తూనే దాని పరిధిని రాజకీయ ప్రవేశం ద్వారా విస్తృతం చేయాలని భావించారు, చేసి చూపారు కూడా. కాంగ్రెస్ పార్టీలో ఆయన చురుకుగా పనిచేయడం జరిగింది. దానితో 1980-83లో రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ, వైద్య, విద్యా శాఖామంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. కడప నుండి నాలుగు సార్లు ఆయన ఎన్నుకోబడ్డారు. పులివెందుల నుండి ఆయన ఆరు సార్లు ఎన్నిక అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబునాయుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు మిత్రులుగా ఉన్నారు. అనంతరం 1985-1998 మధ్య వైఎస్ సొంత పార్టీలోనే అసమ్మతిగా భావించబడ్డారు, పార్టీ వ్యవహారాలు నచ్చక ఆయన అలా వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది. దీనితో కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా ఆయనకు పేరు వచ్చేసింది.
ఈ అసమ్మతి సమయంలో దాదాపుగా కాంగ్రెస్ అందరి ముఖ్యమంత్రులతో ఆయన విభేదించాల్సి వచ్చేది. 1989 తర్వాత ఆయనే స్వయంగా సీఎం కావాలని ప్రయత్నించినప్పటికీ ఆ అవకాశం రాలేదు. మర్రి చెన్నారెడ్డి, జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి వారితో నిత్యం ఏదో ఒక విషయంలో రాజకీయ యుద్దాలు చేయాల్సి వచ్చింది. వారిని పదవి నుండి తొలగించడానికి ఆయన కాంపు రాజకీయాలు చేసినట్టుగా అపవాదులు తెచ్చుకున్నారు. రాజకీయాలలో ప్రజాసేవ తప్ప మరొకటి ఆయన తట్టుకునేవారు కాదు, ఆ విధానం మిగిలిన వారికి నచ్చకపోవడం వలన ఇలాంటివి తప్పలేదు. ఆయన ముక్కుసూటి తనం, నిర్మొహమాటమే తరువాత కాలంలో ఆయనను తిరుగులేని నేతగా నిలబెట్టాయి.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మూడు సార్లు బాధ్యతలు చేపట్టారు. 1983-85లో ఒకసారి, 1998-2000 వరకు మరోసారి, 1999-2004 లో ప్రతిపక్షంలో ఉన్నా, పీసీసీ బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయన పాదయాత్ర చేపట్టడం, దానిలో భాగంగా 1467కిమీ మేర ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలను కలిసి, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని, దానితో మేనిఫెస్టో తయారు చేసి, తరువాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి రాష్ట్రానికి సీఎం అయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీలను పదవి ప్రమాణం చేయడంతోనే అమలు చేయడం ప్రారంభించారు. ఉచిత విద్యుత్, పెండింగ్ లో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఆరోగ్యశ్రీ లాంటివి అమలు చేశారు. అలా సాగిన ఆ పాలన నచ్చడంతో తరువాత అంటే 2009 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ ఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆ సమయంలోనే విమానప్రయాణంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: