కోట్ల దూకుడు..కర్నూలు టీడీపీలో ఊహించని ట్విస్ట్...?

VUYYURU SUBHASH
దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, కర్నూలు జిల్లాలో కీలక నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి...ఇప్పుడు టీడీపీలో బాగా దూకుడుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో...రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి మరీ దారుణంగా తయారైన విషయం తెలిసిందే. దీంతో కోట్ల...తన భార్య సుజాతమ్మతో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. ఇక గత ఎన్నికల్లో కోట్ల..కర్నూలు ఎంపీగా బరిలో దిగితే...సుజాతమ్మ...ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు.

ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ ఇప్పుడుప్పుడే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది...టీడీపీకి జనాల్లో ఆదరణ వస్తుంది...ఈ క్రమంలోనే కోట్ల ఫ్యామిలీ ఫుల్ యాక్టివ్ అయింది. సుజాతమ్మ ఆలూరులో దూకుడుగా పనిచేస్తున్నారు. అక్కడ వైసీపీకి యాంటీ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె ఖచ్చితంగా గెలిచేలా ఉన్నారు. ఇటు కోట్ల కూడా కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో దూకుడు కనబరుస్తున్నారు. నెక్స్ట్ ఎలాగైనా కర్నూలు పార్లమెంట్ బరిలో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు.

అసలు కర్నూలు పార్లమెంట్‌లో టీడీపీ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే గెలిచింది...అందుకే ఈ సారి ఎలాగైనా పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో కోట్ల ముందుకెళుతున్నారు. అయితే కోట్ల దూకుడు వల్ల కాస్త ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. పార్లమెంట్ ఇంచార్జ్‌గా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోట్ల సెపరేట్‌గా పార్టీ ఆఫీసులు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా టీడీపీ ఆఫీసు పెట్టారు.

కానీ అక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ఆఫీసు కూడా ఉంది. ఒక ఆఫీసు ఉండగా, మరో ఆఫీసు పెట్టడంపై  మాజీ ఎమ్మెల్యే వర్గం అసంతృప్తితో ఉంది. అయితే కోట్ల...ఆఫీసు ఓపెనింగ్‌కు మాజీ ఎమ్మెల్యేని కూడా ఆహ్వానించారు...కానీ మాజీ ఎమ్మెల్యే రాలేదు. దీంతో ఆయన కూడా సెపరేట్ ఆఫీసు ఓపెన్ చేయడంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమం కోట్ల, జయనాగేశ్వర్‌ల మధ్య గ్యాప్‌కు కారణమైంది. మరి ఈ గ్యాప్ ఇలాగే కంటిన్యూ అయితే పార్టీకే ఇబ్బంది అవుతుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: