ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి :చంద్రబాబు+కొండబాబు.. గోతికాడ నక్కలు..?

MOHAN BABU
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సిగ్గు పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కాకినాడ ఎలక్షన్ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నా మీద కన్నబాబు మీద ఊగి పోతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి నాయకులు కూడా ఆశ్చర్యపోతూ చూశారు. మీరు బాగుండి, నీ ప్రవర్తన మార్చుకుని, మీ హవా భావాలు బాగుంటే మేము మీ కంటే బాగుంటాం. మన 30 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు ప్రదర్శించ లేదని ఎమ్మెల్యే అన్నారు. మేం మాట్లాడానికి ప్రధాన కారణం మా నాయకుని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారు గత 15 రోజుల నుంచి తనకు ఇష్టం  వచ్చినట్లుగా ఒక సైకో, నియంత,  హిట్లర్ పరిపాలన అంటూ మాట్లాడితే ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు ఖండించారా అని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడిగారు.

ఇప్పటికైనా జనసేన నాయకులు కానీ  టిడిపి నాయకులు కానీ మీ భాషను మార్చు ఉంటే బాగుంటుందని, మీరు ఇలా మాట్లాడితే మేము కూడా అలాగే మాట్లాడతా మని అన్నారు. మీ ఇల్లు మాకు ఎంత దూరమో మా ఇల్లు  కూడా మీకు అంతే దూరం అని అన్నారు.  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ప్రవేశ పెట్టడం చాలా సంతోష కరమని, ఇప్పటి వరకు పట్టాగా ఉండే ఇంటి ఆస్ధి ఈ పధకంతో జిరాయితీగా మారుతుందనీ తెలియజేశారు.  ఇలాంటి మంచి పధకాన్ని తప్పుదోవ పట్టించి టిడిపి ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తోందనీ, ప్రభుత్వాన్ని ఏలా విమర్శించాలా అని మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారనీ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు,గృహ రుణాలు మాఫీ చేస్తామని ప్రజల్ని మోసం చేశారు.
మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారు. వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నాను. వచ్చే ఎన్నికలకు కాకినాడ నుండి టిడిపిలో కొండబాబుకు  టిక్కెట్టు లేదనీ చంద్రబాబు సిఎం అవ్వడం, కొండబాబుకు టిక్కెట్టు రావడం ఒక కలే అని కడిగిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: