కోడెల వర్సెస్ రాయపాటి...సత్తెనపల్లి తేలేది ఎప్పుడు?

M N Amaleswara rao
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతూ వస్తుంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నిదానంగా పికప్ అవుతూ వస్తుంది. అలాగే ఎన్నికల్లో ఓడిపోయాక చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వ సమస్య వచ్చింది. ఇక ఆ సమస్యని చంద్రబాబు నిదానంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు సరిగ్గా లేరు.
ఇంకా కొన్ని చోట్ల నాయకులని సెట్ చేయాలి. ఇదే క్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సత్తెనపల్లి కోడెల ఫ్యామిలీ చేతుల్లో ఉన్న విషయం తెలిసిందే. 2014లో కోడెల శివప్రసాద్ ఇక్కడ నుంచే గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కోడెల తర్వాత ఆయన తనయుడు శివరాం...నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సత్తెనపల్లిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే శివరాంకు నియోజకవర్గ బాధ్యతలని అధికారికంగా మాత్రం చెప్పలేదు. పైగా ఇక్కడ కోడెలకు వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో సత్తెనపల్లి సీటు కోసం రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. రాయపాటి తనయుడు రంగబాబు...సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనే సీటు కోసం ట్రై చేశారు. కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
అయితే చంద్రబాబు..సీటు ఎవరికీ కేటాయించడం లేదు. దీనిపై ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌ అయోమయానికి గురవుతుంది. త్వరగా ఈ సీటుపై తేల్చేస్తే పార్టీకే బెనిఫిట్ అవుతుంది. లేదంటే మళ్ళీ సత్తెనపల్లి టీడీపీ గెలుపు కష్టమవుతుంది. కాస్త న్యాయంగా చూస్తే కోడెల ఫ్యామిలీ రాజకీయాల్లో కొనసాగాలంటే...శివరాంకే సత్తెనపల్లి సీటు ఇవ్వాలి. మరి సత్తెనపల్లి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: