ఆ టీఆర్ఎస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి జంపేనా ?

VUYYURU SUBHASH
తెలంగాణ లో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర వేగంగా మారుతోన్న విష‌యం మ‌నం చూస్తూనే ఉన్నాం. అధికార టీఆర్ ఎస్ కు ఇప్ప‌టి వ‌ర‌కు తిరుగు లేక‌పోయినా ఇప్పుడిప్పుడే ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీలో అవ‌కాశాలు లేని వారు. గుర్తింపు లేని వారు ఇప్పుడు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా పార్టీలో తీవ్ర అవ‌మానం జ‌రిగిన ఓ నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్టు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేత ఎవ‌రు ?ఆ క‌థ ఏంటో చూద్దాం.

ఉప ఎన్నికలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన తేరా చిన్నపరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ ప‌ద‌విని ఎందుకు రెన్యువల్‌ చేయలేదు ? తేరా వర్గానికి ఎక్కడ తేడా కొట్టింద‌న్న దే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తేరా చిన్న‌ప రెడ్డి ఇప్ప‌టికే రెండుసార్లు ఎమ్మెల్సీ బరిలో నిలిచి కోట్లాది రూపాయ‌లు ఖర్చు చేశారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో భారీగా ఖ‌ర్చు చేసి గెలిచారు. ఆయ‌న పూర్తి స్థాయిలో ప‌ద‌వి లో లేరు. దీంతో మ‌రోసారి ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రెన్యువ‌ల్ అవుతుంద‌నే అంద‌రూ అనుకున్నారు.

అయితే జిల్లాకే చెందిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చ‌క్రం తిప్పి తేరా ప్లేస్‌లో MC కోటిరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు చిన్న‌ప రెడ్డి ఏం చేస్తారు ? అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది. చిన్నపరెడ్డి గతంలో జానారెడ్డి అనుచరుడు కావటం తో పాటు .. ఆయన జిల్లాలో పెద్దగా ఎవరితో కలిసుండక పోవటం కూడా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రెన్యువ‌ల్ కాక పోవ‌డానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు.

దీంతో చిన్న‌ప రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ చేసేస్తారని అంటున్నారు. మ‌రి ఆయ‌న పొలిటిక‌ల్ స్టెప్ ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: