కర్నూలులో కనిపించని డ్యామేజ్ ఎక్కువే..?

M N Amaleswara rao
కర్నూలు జిల్లా...ఇక డౌట్ లేకుండా వైసీపీ అడ్డా అని చెప్పేయొచ్చు...ఇందులో వేరే మాటే లేదు. కర్నూలు అంటే వైసీపీ కంచుకోట....గత రెండు ఎన్నికల్లో అదే రుజువైంది. మరి వచ్చే ఎన్నికల్లో కూడా అదే రుజువు అవుతుందా? అంటే ఏమో కాస్త డౌటే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలా అని వైసీపీ ఆధిక్యం తగ్గడం కష్టమని, కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకే దక్కుతాయని, కానీ క్లీన్‌స్వీప్ చేసే పరిస్తితి మాత్రం ఉండదని ఖచ్చితంగా చెబుతున్నారు.
గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేశారు గానీ, ఈ సారి మాత్రం ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత పెరిగిందని, అలాగే పలుచోట్ల టీడీపీ కూడా పుంజుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో పరిస్తితి తారుమారు అవుతుందని అంటున్నారు. ఏదో అధికార బలం ఉండటం వల్ల స్థానికంలో స్వీప్ చేశారు గానీ, క్షేత్ర స్థాయిలోకి వెళితే మాత్రం వైసీపీకి కాస్త డ్యామేజ్ జరుగుతున్నట్లే కనిపిస్తుందని చెబుతున్నారు.
కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఏడు చోట్ల వైసీపీనే గెలుస్తుందా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే పలు నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంది...అలాగే టీడీపీ పుంజుకుంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఆలూరు ముందు వరుసలో ఉంది. ఇక్కడ వైసీపీకి బాగా యాంటీ వస్తుంది. అలాగే టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ పుంజుకుంటున్నారు.


కర్నూలు సిటీలో అదే పరిస్తితి...ఇక్కడ టీడీపీ నేత టీజీ భరత్ పికప్ అవుతున్నారు. ఇటు మంత్రాలయంలో వైసీపీకి యాంటీ ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి...పైగా ఇక్కడ టీడీపీ నేత తిక్కారెడ్డికి రాజకీయంగా కలిసొస్తుంది. కోడుమూరులో వైసీపీకి వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. పత్తికొండ, యెమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏదేమైనా కర్నూలులో వైసీపీకి కనిపించని డ్యామేజ్ ఎక్కువగానే ఉన్నట్లుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: