కృష్ణాలో ఆ వైసీపీ ఎమ్మెల్యేకు చెక్ ప‌డుతుందా...!

VUYYURU SUBHASH
మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికల అంటే అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి...అందులోనూ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా అనుకూలంగా జరుగుతాయి. అయితే కొన్నిచోట్ల టీడీపీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కీలకంగా మారిన పెడన జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ, వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది. గతంలో వాయిదా పడిన పెడన జెడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
పెడన రూరల్ మండలానికి ఎన్నిక జరగనుంది...అయితే ఈ రూరల్ మండలం చాలా కీలకం...ఈ మండలమే నియోజకవర్గంలో గెలుపోటములని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ ఎన్నికని వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళుతున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ స్థానం కైవసం చేసుకుంటే చాలు తనకు తిరుగుండదని అనుకుంటున్నారు. కానీ దీనిపై టీడీపీ గట్టిగానే ఫోకస్ చేసింది.
ఇప్పటివరకు కాస్త అటు ఇటు అయినా సరే...పెడన స్థానాన్ని మాత్రం వదలకూడదని ఫిక్స్ అయింది. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి వివాదంలో ఉన్న జోగి రమేష్‌కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో జడ్పీటీసీ పోటీకి టీడీపీ గట్టి అభ్యర్థిని నిలబెట్టింది. అటు వైసీపీ తరుపున కూడా బలమైన అభ్యర్ధి నిలబడ్డారు. అయితే ఆర్ధిక పరంగా కూడా ఈ సారి వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా పనిచేస్తుంది. పెడన ఇంచార్జ్ కాగిత వెంకటకృష్ణప్రసాద్, బందరు పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావులు...స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.
అయితే ఇక్కడ టీడీపీకి ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే...జనసేన పోటీలో లేకపోవడం...జనసేన పోటీలో ఉంటే ఓట్లు చీలిపోయి వైసీపీకే ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో జోగి రమేష్ గెలవడానికి కారణం కూడా అదే. కానీ జెడ్పీటీసీ స్థానంలో అలాంటి పరిస్తితి రాకూడదని జనసేన పోటీ నుంచి తప్పుకున్నట్లు ఉంది. అలాగే పరోక్షంగా జోగికి చెక్ పెట్టడానికి టీడీపీకి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: