షాకింగ్ : వ్యాక్సిన్ తీసుకోని వారికి లాక్ డౌన్??

praveen
చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయిన మహమ్మారి కరోనా వైరస్ అన్ని దేశాలను కమ్మేసింది. చూస్తూ చూస్తుండగానే ప్రపంచ దేశాలను మొత్తం గుప్పిట్లోకి తెచ్చుకుని అల్లకల్లోల పరిస్థితులు తీసుకువచ్చింది. ఒక దశ కరుణ వైరస్ ముగియగానే మరొక దశ కరోనా వైరస్ కూడా ముంచుకొచ్చింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక అన్ని దేశాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనా వైరస్ బారి నుంచి బయట పడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో కీలకం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అత్యవసర వినియోగం లోకి తీసుకు వచ్చిన వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తున్నాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. ఇక వ్యాక్సిన్ పై అందరిలో అవగాహన కల్పించడానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉండటం గమనార్హం. అయితే ప్రభుత్వం ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అటు కొంత మంది జనాలు మాత్రం వ్యాక్సిన్ విషయంలో అవగాహన లేమితో ఇప్పటికి కూడా టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఇలా ప్రజల నిర్లక్ష్యం కాస్త దేశానికి శాపం గా మారిపోతుంది.

ఇప్పటికే కొన్ని దేశాలలో థర్డ్ వేవ్ మొదలైన నేపథ్యంలో.. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం  మరింత కచ్చితం గా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారందరికీ కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసపింది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోనివారు పబ్లిక్ ప్లేస్ లోకి రావడానికి వీలు లేదు అంటూ కఠిన నిబంధనలు విధించింది. ఎమర్జెన్సీ సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో వ్యాక్సిన్ వేసుకోని వారు ఇల్లు దాటి  జనావాసాల్లోకి రాకూడదు అంటూ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: