రిస్క్ వద్దంటున్న తూర్పు తమ్ముళ్ళు..పవన్‌పైనే భారం వేశారా?

M N Amaleswara rao

రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. తొందరపడి వారు రాజకీయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పటినుంచే హడావిడిగా రాజకీయం చేస్తే...నెక్స్ట్ ఎన్నికల ముందు ఇబ్బందులు పడక తప్పదని తమ్ముళ్ళు భావిస్తున్నారు.
అందుకే జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు...ఎప్పుడుపడితే అప్పుడు యాక్టివ్ అవ్వడం లేదు. ఏదో పార్టీ తరుపున కార్యక్రమాలు ఉంటే అప్పుడు కాస్త హడావిడిగా కనిపిస్తున్నారు...తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఎలాగో యాక్టివ్‌గా ఉండటం తప్పడం లేదు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తరుపున ఆమె భర్త శ్రీనివాస్...నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. అటు రూరల్‌లో బుచ్చయ్య చౌదరీ పనిచేస్తున్నారు.
ఇక మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు, పెద్దాపురంలో చినరాజప్పలు కాస్త పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ మిగిలిన టీడీపీ నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలిన సమయంలో అడ్రెస్ ఉండటం లేదు. పైగా నియోజకవర్గాల్లో కుడా పెద్దగా తిరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో తిరుగుతూ, కార్యకర్తలని పోగేసి పార్టీ కార్యక్రమాలు చేస్తే ఆర్ధికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పుడే ఆర్ధిక పరమైన ఖర్చులు ఎక్కువైతే....నెక్స్ట్ ఎన్నికల ముందు ఏం ఖర్చు పెట్టగలమని తమ్ముళ్ళు భావిస్తున్నారు.
పైగా పార్టీ నుంచి ఫండింగ్ కుడా పెద్దగా వచ్చేలా లేదు..అందుకే ఇప్పుడే రిస్క్ తీసుకోవాలని తమ్ముళ్ళు అనుకోవడం లేదు. ఎన్నికల ముందు బయటకొచ్చి అప్పుడు దూకుడుగా పనిచేయొచ్చని భావిస్తున్నారు. అంతవరకు ఇలాగే అప్పుడప్పుడు పార్టీ నాయకత్వానికి కనిపిస్తే చాల్లే అనుకుంటున్నారు. అదే సమయంలో తూర్పులో మెజారిటీ తమ్ముళ్ళు...పవన్‌పైనే భారం వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంటేనే...తూర్పులో చాలాచోట్ల టీడీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా జనసేన విడిగా పోటీ చేస్తే తమ పని అస్సామే అని తమ్ముళ్ళు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: