ఆ ఏపీ మంత్రికి ఈ సారి వ‌ప‌న్ సాయం ఉండ‌దా...!

VUYYURU SUBHASH
ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది...అందులో ఎలాంటి అనుమానం లేదు. సినీ రంగంలో తిరుగులేని పొజిషన్‌లో ఉన్న మెగా ఫ్యామిలీ వల్ల రాజకీయ సమీకరణాలు బాగానే మారతాయి. గతంలో చిరంజీవి , ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రభావం ఏపీ రాజాకీయాలపై బాగా ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే...వీరికేమో గెలిచే అవకాశం రాదు...అలాగే టీడీపీని గెలవనివ్వరు. రెండు పర్యాయాలు అదే పని జరిగింది.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం వల్ల టీడీపీకి ఎంత బొక్క పడిందో  అందరికీ తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్ బెనిఫిట్ అయింది..కానీ 2014 ఎన్నికల్లో పవన్ ఓట్లు చీలిపోకూడదని చెప్పి టీడీపీకి సపోర్ట్ ఇచ్చి అధికారంలోకి రావడానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓట్లు చీల్చి టీడీపీకి బాగానే డ్యామేజ్ చేశారు. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, వైసీపీకి బాగా ప్లస్ అయింది. అయితే అప్పుడు చిరంజీవి వల్ల, ఇప్పుడు పవన్ వల్ల చాలామంది నాయకులు బెనిఫిట్ పొందారు.
అలా బెనిఫిట్ పొందినవారిలో కన్నబాబు కూడా ఒకరు. అప్పుడు చిరంజీవి వల్ల ప్రత్యక్షంగా....ఇప్పుడు పవన్ వల్ల పరోక్షంగా లాభపడ్డారు. 2009 ఎన్నికల్లో కన్నబాబు తొలిసారి ఎన్నికల బరిలో దిగి కాకినాడ రూరల్‌లో గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి కన్నబాబు వైసీపీ నుంచి విజయం సాధించారు.
టీడీపీపై దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ కాకినాడ రూరల్‌లో జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఏ విధంగా ఓట్లు చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు. జనసేన వల్ల కన్నబాబుకు ఎలా ప్లస్ అయిందో కూడా అర్ధమవుతుంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ విడిగా పోటీ చేస్తే ఇదే ఫలితం రిపీట్ అవుతుంది..అలా కాకుండా ఆయన టీడీపీతో కలిస్తే కన్నబాబుకు ఛాన్స్ ఉండదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: