వారెవా మోదీ.. వరల్డ్ నెంబర్‌ వన్‌ లీడర్..!

Chakravarthi Kalyan
మన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచ నెంబర్ వన్ లీడర్‌గా వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచంలోనే ఎక్కువగా ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ఫస్ట్ ర్యాంక్ కొట్టేశారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ అనేక దేశాల్లో సర్వే నిర్వహించి తాజాగా ర్యాంకులు ప్రకటించింది. అనేక దేశాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే తాజా ఫలితాలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మోదీ 70 శాతం ప్రజామోదంతో ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంక్‌ సాధించారు. ఈ మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ నిర్వహించిన  సర్వేలో లాస్ట్ ఇయర్ కూడా నరేంద్ర మోదీనే టాప్ ర్యాంక్ సాధించారు. ఈ సంస్థ ఈ ఏడాది ఇండియాలో  2 వేలమందికి పైగా ఆన్‌లైన్‌ లో ఇంటర్వ్యూ చేసి ఈ ఫలితాలు ప్రకటించింది. ఇక ఈ సర్వే ఫలితాల్లో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌  66 శాతం ప్రజామోదంతో నెంబర్ టూగా నిలిచారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58 శాతం ప్రజామోదంతో మూడో స్థానంలో నిలిచారు.

అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ.. నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానానికి పరిమితం కావడం విశేషం. ఇక మిగిలిన నాయకుల విషయానికి వస్తే.. ఏంజెలా మెర్కెల్‌, జర్మనీ ఛాన్సలర్‌ 54 శాతం.. స్కాట్‌ మోరిసన్‌, ఆస్ట్రేలియా ప్రధాని 47 శాతం, జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని 43 శాతం ప్రజామోదం పొందారు. ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధాని 42 శాతం, మూన్‌ జే-ఇన్‌- ద.కొరియా అధ్యక్షుడు 41 శాతం, బోరిస్‌ జాన్సన్‌, బ్రిటన్‌ ప్రధాని 40 శాతం ప్రజామోదం పొందారు.

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌  37 శాతం ప్రజామోదం పొందగా... ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ 36 శాతం.. బ్రెజిల్‌ అధ్యక్షుడు  జైర్‌ బోల్సొనారో  35 శాతం ఆమోదంతో జాబితాలో చివరి స్థానాలకు పరిమితం అయ్యారు. మొత్తానికి మోడీ మరోసారి ఈ సర్వే ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ప్రజామోదం ఉన్న నాయకుడిగా మరోసారి నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: