యాత్రకు నాలుగేళ్లు : ముళ్లు దాటాడు కానీ?

RATNA KISHORE
బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి టీడీపీ ని వైసీపీ ఢీకొంది. అందుకు త‌గ్గ ప్ర‌య‌త్నాల‌న్నీ మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసింది. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాను అడ్డంపెట్టుకుని డ్రామాను న‌డిపింది. త‌న‌కు అధికారం ఇస్తే త‌న పార్టీకి చెందిన 25 మందినీ ఎంపీలుగా గెలిపిస్తే ఆంధ్రాకు ప్ర‌త్యేక హోదా త‌థ్యం అని కూడా చెప్పారు. కానీ అధికారం చేప‌ట్టి ఢిల్లీ వెళ్ల‌గానే త‌న ప‌రిధిలో హోదా అంశం లేద‌ని దేవుడి ద‌య‌వ‌ల్ల మోడీ క‌రుణిస్తేనే హోదా వ‌స్తుంద‌ని చెప్పి త‌ప్పించుకున్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కూడా అప్ప‌ట్లో చాలా ఉద్య‌మం రేగింది. అది కూడా మ‌రుగున ప‌డిపోయింది. ఇక అధికారంలోకి వ‌చ్చాక స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యమై  తీవ్ర వ్య‌తిరేక‌త ఒక‌టి వ‌చ్చింది. దీనిపై కూడా జ‌గ‌న్ పెద్ద‌గా మాట్లాడ‌లేదు. మాట్లాడినా కూడా అవ‌న్నీ పైపైన డాంబికాల‌కే ప‌రిమితం అయ్యాయి.
ముఖ్యంగా వైసీపీ మొద‌ట్నుంచి రాష్ట్రంకు సంబంధించిన హ‌క్కుల విష‌యంలో మాట్లాడేందుకు వెనుకంజ వేస్తూనే ఉంది. వ్య‌వ‌సా య చ‌ట్టాల‌కు సంబంధించి చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల నిర‌స‌న‌లు ఉన్నాయి. అదేవిధంగా ఇక్క‌డ కూడా నిర‌స‌న‌లు ఉన్నా అవి ప‌ట్టించుకోకుండా కేంద్రం అడ‌గ‌కుండానే మ‌ద్దతు ఇచ్చిన ఘ‌న‌త వైసీపీదే! అలానే సాగు చ‌ట్టాల‌ను పార్ల‌మెంట్ లో వ్య‌తిరేకించ‌కుం డా బ‌య‌ట మాత్రం వాటిపై నిర‌స‌న‌లు చెప్ప‌డం కూడా వైసీపీ రెండు నాల్క‌ల ధోర‌ణికి సంకేతం.
ఇక వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల అమ‌ర్చ‌డంపైన కూడా చాలా రాద్ధాంతం అయింది. దీనిపై కూడా వైసీపీ అత్యుత్సాహ‌మే చూపింది. క‌నీస స్థాయిలో కూడా వ్య‌తిరేకించ‌కుండా కేంద్రం ఏం చెబితే అది చేసుకుని పోయేందుకు సిద్ధం అయింది. ఇక తీవ్ర న‌ష్టాల్లో ఉన్న డిస్కంలను ఒడ్డెక్కించేందుకు స‌ర్దుబాటు ఛార్జీలు వ‌డ్డించింది. అదేవిధంగా సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు స‌కాలంలో చెల్లించ‌క తీవ్ర విద్యుత్ సంక్షోభం వ‌స్తుంద‌న్న స‌మ‌యంలో మేల్కొంది. త‌న సొంత సంస్థ‌ల‌కు మేలు చేసేలా విద్యుత్ ను ప్ర‌యివేటు కంపెనీల నుంచి అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి ప్ర‌భుత్వ విద్యుత్ ప్లాంట్ల‌ను మూల‌న బెట్టింది. దీంతో జ‌గ‌న్  అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం చొర‌వ‌తో కాస్త ఒడ్డెక్కారు. ఇవే కాదు ఇంకా చాలా స‌మ‌స్య‌ల్లో ఇవాళ ప్ర‌భుత్వం ఉంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ ఆస్తుల త‌నఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవ‌డం అన్న‌ది పెద్ద వివాదంగా మారింది. ఇందుకు విశాఖ కేంద్రంగా ఉన్న ఆస్తుల‌ను భ‌వంతుల‌ను ప్ర‌భుత్వం వినియోగించుకుంది. ఇంకా చాలా ఆరోప‌ణ‌లే ఉన్నాయి. ఒక‌నాడు ముళ్లు దాటి వ‌చ్చిన జ‌గ‌న్ ఇప్పుడు నాటి దారుల‌ను మ‌రిచిపోవ‌డ‌మే పెద్ద వింత!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: