బ్రేకింగ్: ఓడిశా సిఎంతో జగన్ భేటీ...?

Sahithya
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితికి సంబంధించి ఇప్పుడు కాస్త ఆసక్తికర విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఏదోక సందర్భంలో వాళ్ళు విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ ఇక లేదు అని మంత్రులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ టీడీపీ పరిస్థితికి సంబంధించి ఆసక్తికర విమర్శలు చేసారు. ప్రజలకు జవాబు దారీగా అభివృద్ధి, సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలకు సిఎం పట్టించుకోవడం లేదు అని అన్నారు ఆయన. జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం టీడీపీ  పార్టీదే అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ ఇతర పార్టీలతో పొత్తుల వ్యవహారం సిగ్గుచేటు అని ఎద్దేవా చేసారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది అన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసిన టీడీపీ  నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
రైతుల సమస్యలు పట్టించుకోని టీడీపీ  నేడు రైతుల సమస్యలపై ఆందోళన చేయడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. వంశధార నది పై నేరేడు బ్యారేజ్ నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒడిషా వెళ్తారు అని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చించి నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి వున్న ఆటంకాలు త్వరలో తొలిగి పోతాయన్నారు. బద్వేలు ఎన్నికల్లో జనసేన బిజెపికి మద్దతు ఇస్తే, టీడీపీ  లోలోపల మద్దతు ఇచ్చి భంగ పడింది అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ  పార్టీ ని కాపాడుకునేందుకు జనసేన, బిజెపి పార్టీల సహాయాన్ని చంద్రబాబు అర్జిస్తున్నారు అని ధర్మాన ఎద్దేవా చేసారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా టీడీపీ  పార్టీ రాష్ట్రంలో కోలుకోలేదు అని వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: