ఆ వైసీపీ క‌మ్మ ఎమ్మెల్యే మ‌ళ్లీ గెలుస్తాడా...!

VUYYURU SUBHASH
ఏపీలో అధికార వైసీపీ లో క‌మ్మ నేత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌న్న టాక్ అయితే ఉంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక త‌న పార్టీ లో మాత్ర‌మే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క‌మ్మ నేత‌ల‌ను అన్ని విధాలా అణ‌గ దొక్కేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. అయితే వైసీపీలో కూడా కొంద‌రు క‌మ్మ నేత‌ల‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అయితే వీరి సంఖ్య చాలా త‌క్కువ‌. వైసీపీ నుంచి ఆరుగురు క‌మ్మ ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. ఇక మంత్రుల విష‌యానికి వ‌స్తే ఒక్క కొడాలి నాని మాత్ర‌మే క‌మ్మ మంత్రి గా ఉన్నారు.
ఇక వైసీపీకి ఉన్న ఆరుగురు క‌మ్మ ఎమ్మెల్యేల్లో గుంటూరు జిల్లా నుంచే  ముగ్గురు ఉన్నారు. వీరిలో పెద‌కూర‌డ‌పాడు ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావు వ‌రుస‌గా రెండో సారి గెలిచేందుకు అప్పుడే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గెలుపు త‌న‌దే అన్న ధీమాతో ఆయ‌న ఉన్నార‌ట‌. ఒక‌ప్పుడు  కాంగ్రెస్ కు ఇంకా చెప్పాలంటే మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ వ‌రుస విజ‌యాలు సాధించారు.
గ‌త ఎన్నిక‌ల్లో శ్రీధ‌ర్‌పై శంక‌ర్రావు గెలిచారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో క‌మ్మ వ‌ర్గం ఓట్లు  ఎక్కువ‌.  ఇక 14 వేల రెడ్డి ఓట్ల తో పాటు 41 వేల ఎస్సీ ఓట్లు, 30 వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇక్క‌డ ప‌దేళ్లు ఎమ్మెల్యే గా ఉన్న  కొమ్మాల‌పాటి ఇప్పుడు ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు అనుకూలంగా లేక‌పోవ‌డంతో నియోజకవర్గాన్ని మార్చాలని చూస్తున్నార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా ఉంది. ఆయ‌న గుంటూరు వెస్ట్ వైపు క‌న్నేశార‌ట‌.
ఇక  సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్రావు మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంతో  మ‌రింత గా ప్ర‌జ‌ల్లోకి దూసుకు  వెళుతున్నారు. పైగా వివాదాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు అక్క‌డ ప్ల‌స్‌లుగా ఉన్నాయి. దీంతో ఆయ‌న రెండోసారి గెలుపు  పై ధీమాతో ఉన్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: