బద్వేలు గెలుపు జగన్ కు పెద్ద మచ్చ ?

Veldandi Saikiran
గుంటూరు ః  బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలపై  కన్నా  లక్ష్మి నారాయణ  షాకింగ్‌  కామెంట్స్ చేశారు.   బద్వేలు ఉప ఎన్నిక బిజెపి కార్య కర్త ల కి మనో ధైర్యం కల్గించిందని.. తెలిపారు కన్నా లక్ష్మి నారాయణ.  సిఎం  జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత జిల్లా లోని నియోజకవర్గం లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని బెదిరించారన్నారు కన్నా  లక్ష్మి నారాయణ. ఎన్నికల రోజు అధికార యంత్రాంగంతో సైకిలింగ్, రిగ్గింగ్ చేసిన ప్పటికీ వాళ్ళు తెచ్చుకుంటామన్న మెజార్టీ రాలేదని... ఇదే ఆయన రెండేళ్ల పాలనకు నిదర్శనమన్నారు కన్నా  లక్ష్మి నా రా య ణ. 

టిడిపిని తిట్టే జగన్, ఆయన మంత్రులు టిడిపి నేతల ఇళ్ళకి వెళ్ళారు. బద్వేలు గెలుపు జగన్ కు మచ్చ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు కన్నా  లక్ష్మి నారాయణ. ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన గెలుపు కాదు. నైతికంగా బిజెపి పార్టీ  గెలిచిందన్నారు కన్నా  లక్ష్మి నారాయణ. అక్రమాలతో పాటు ఓటుకు నోటు పంచారు... ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆగ్రహం వ్యక్త ం చేశారు కన్నా  లక్ష్మి నారాయణ.

 బిజెపి ఓటింగ్ శాతం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తో కలిసే వెల్తామని స్పష్టం చేశారు కన్నా  లక్ష్మి నారాయణ. రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితి. రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నామని తెలియ జేశారు కన్నా  లక్ష్మి నారాయణ.  ప్రవేటీకరణ చేయాలనేది ప్రభుత్వ పాలసీ అని... స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మారినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదన్నారు.  ఉద్యోగుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు కన్నా  లక్ష్మి నారాయ ణ.  వచ్చే ఎన్నికల్లో ఎలా గైనా బీ జేపీ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు కన్నా  లక్ష్మి నారాయణ.  తాను చెప్పిన మాటలు నిజం అవుతాయని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: