కలవరపెడుతున్న డెంగ్యూ.. కేంద్రం హై అలర్ట్...!

Podili Ravindranath
రెండేళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా... ప్రతి రోజు 20 వేల పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా కలవరపెడుతున్నాయి. ఇప్పటికీ కొవిడ్ నిబంధనలు అమలు చేస్తోంది కూడా. ఇక మాస్క్ ధరించని వారిపై అయితే ఏకంగా వెయ్యి రూపాయల జరిమానా విధించాలని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో ఇప్పుడు కొత్తగా డెంగ్యూ కేసులు పెరగడం కేంద్రాన్ని కలవరపరుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా డెంగ్యూ జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా 9 రాష్ట్రాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో అయితే డెంగ్యూ జ్వరం కారణంగా చిన్నారులు మృతి చెందుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. డెంగ్యూ జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలు ఇప్పటికే చేరిపోయాయి కూడా.
డెంగ్యూ జ్వరం కేసులు ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదు అవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలు చేసింది కూడా. దక్షిణా భారత దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలోని ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం... ఎన్‌సీడీసీ నిపుణులు కేసులు అధికాంగా ఉండే రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారులు కూడా వీరితో పాటు పరిస్థితిని అధ్యయనం చేయనున్నారు. డెంగ్యూ జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందాలు పరిశీలించనున్నాయి. అలాగే ఆయా రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని కూడా అందివ్వనున్నారు. డెంగ్యూ జ్వరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందం సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: