తెలంగాణ కాంగ్రెస్ నుంచి వాళ్ళు సస్పెండ్...?

VUYYURU SUBHASH
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో పార్టీ నాయకుల తీరు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు పార్టీ బలపడే విషయానికి సంబంధించి కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కీలక నాయకులు రేవంత్ రెడ్డి సహకరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి పార్టీకోసం కష్టపడడానికి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న పార్టీ నిరసన కార్యక్రమాలకు సంబంధించి అందరికీ ఆహ్వానిస్తున్న సరే కొంతమంది ఆయనను దూరం పెడుతున్నారు.
అయితే ఇటీవల కొంత మంది కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ తో అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తో స్నేహం చేయడం తో రేవంత్ రెడ్డి వాళ్ల కు నోటీసు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి పక్క సాక్ష్యాలను సేకరించిన రేవంత్ రెడ్డి త్వరలోనే వాళ్లకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. క్రమశిక్షణ సంఘం నుంచి నోటీసులు ఇచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే వాళ్ళు ఎవరైనా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
ఆ సాక్ష్యాలను అవసరమైతే రేవంత్ రెడ్డి మీడియాకు కూడా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీని ద్రోహం చేస్తున్న వాళ్ళ విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గదని పెద్దలు ఆదేశాలతోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది కీలక నేతలు రెండు పడవలపై కాళ్లు వేశారని వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా లో ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు అంతా పైకి ఒక రాజ‌కీయం చేస్తూ.. లోప‌ల మ‌రోలా లాలూచీ రాజ‌కీయం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.
వీరు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు వ‌ల్లే కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో పీసీసీ అధ్య‌క్షుడు గెలిచిన హుజూర్ న‌గ‌ర్ సీటుతో పాటు సీనియ‌ర్ నేత జానారెడ్డి పోటీ చేసిన నాగార్జునా సాగ‌ర్ సీటును కూడా కోల్పో వాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: