చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే ఎంతో ఆరోగ్యం !

Veldandi Saikiran
చూస్తుండగానే వర్షాకాలం వెళ్లి చలికాలం వచ్చేసింది. అయితే ఈ చలికాలంలో.. చాలా అనేక ఇబ్బందులు మనకు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మహిళలకు ఈ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చర్మం పేలిపోవడం, మొఖం సమస్యలు, జుట్టు రాలిపోవడం మరియు ఎముకల సమస్యలు లాంటి అనేక మహిళలకు ఎక్కువగా తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో మనం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ చలి కాలంలో మనం కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే సులభంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతు న్నారు. ఆహారపు అలవాట్లు ఏంటివి ఎలా వాటిని తప్పించుకోవచ్చు అనేదానిపై ఇప్పుడు తెలుసుకుందాం.

 
విటమిన్ సి : విటమిన్ సీ కారణంగా మహిళలకే కాదు అందరికీ అనేక ఉపయోగాలు ఉన్నాయి. కమల పండ్లు, నిమ్మ, జామకాయలు మరియు బొప్పాయి పండ్లు తీసుకుంటే మనకు విటమిన్ సి విరివిగా లభిస్తుంది. ఈ విటమిన్ సి ఉండటం కారణంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి  పెరుగుతుంది.
ఆకుకూరలు తినటం : ఇంకా ప్రతిరోజు మనం ఆకుకూరలు తీసుకోవడం కారణంగా అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ఆకు కూరలు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి మనకు సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా మన చర్మం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది.
గరం మసాలా : ప్రతి ఒక్కరి ఇంట్లో చాలామంది కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క మరియు యాలకులు గరం మసాల లో వాడితే చాలా మంచిది. మీ వాడడం కారణంగా మనకు జ్వరాలు మరియు జలుబు లాంటి సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతాయి.
నెయ్యి : మనం ప్రతి రోజు కచ్చితంగా తీసుకోవాల్సిన పదార్థం నెయ్యి.  మనం నిత్యం తీసుకోవడం కారణంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి. మన శరీరం చల్లబరచడానికి నీవు చాలా ఉపయోగ పడుతుంది. అలాగే  మహిళల యెక్క సౌందర్యానికి నెయ్యి చాలా ఉపయోగపడుతుంది.
డ్రై ఫ్రూట్స్ : ఖర్జూరం మరియు అంజీర పండ్లు మనం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు ముఖ్యంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: