ఫ్లైట్ ఎక్కిన ప్రధాని మోడీ..!

NAGARJUNA NAKKA
భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ రాజధాని రోమ్ లో జీ-20సదస్సు జరుగనుంది. అక్టోబర్ 29 నుండి 31వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఈ సదస్సులో పాల్గొనడం మోడీకి ఇది ఎనిమిదవ సారి. గత సంవత్సరం జీ-20సదస్సు సౌది అరేబియాలో నిర్వహించారు. అయితే ఆ సమయంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా వర్చువల్ సమావేశంలో ప్రధాని పాల్గొనాల్సి వచ్చింది. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్షంగానే జీ-20సదస్సు నిర్వహిస్తున్నారు. అంతకుముందు 2019లో జీ20సదస్సు ఒసాకాలో జరుగగా ప్రధాని మోడీ ఆ మీటింగ్ కు హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షంగా ఇటలీలో నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో పాల్గొనబోతున్నారు.
ఇటలీ, రోమ్, యూకే, గ్లాస్గోలో ప్రధాని మోడీ పర్యటన బిజీబిజీగా సాగనుంది. జీ-20 సదస్సుతో పాటు కాప్-26 వరల్డ్ లీడర్స్ మీటింగ్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ స్వయంగా తెలిపింది. ఇటలీ ప్రధాని మారియో ప్రధాని మోడీని జీ-20సదస్సుకు ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోడీ ఈ నెల 30, 31వ తేదీల్లో జీ20సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ మీటింగ్ లో జీ-20సభ్య దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.
రెండు రోజుల పాటు జరిగే జీ-20సదస్సుకు ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఆప్ఘానిస్థాన్ లో చోటుచేసుకున్న విపత్కర పరిస్థితులు, వాతావరణంలో మార్పులు, ప్రమాదకరంగా మారిన కాలుష్యం, కొత్తరూపు సందరించుకుంటున్న కరోనా వైరస్ లాంటి అంశాలపై జీ-20సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు వాటికన్ సిటీలో ఉన్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ను కూడా ప్రధాని మోడీ కలవనున్నారు. మొత్తానికి ప్రధాని మోడీ ఇటలీ పర్యటన బిజీబిజీగా సాగనుంది. ఆయన ఆ సమావేశంలో ఏఏ అంశాలపై ప్రస్తావిస్తారో తెలియాల్సి ఉంది. ఆయన పర్యటపై యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: