నాయుడు గారు ఈ సారైనా సెట్ చేస్తారా?

M N Amaleswara rao
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం కూడా ఒకటి అని చెప్పేయొచ్చు..ఎందుకంటే ఇక్కడ టీడీపీ జెండా ఎక్కువసార్లు ఎగిరింది. 1983, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 1985లో సి‌పి‌ఐ, 1989, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2019 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది...వైసీపీ తరుపున ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ బరిలో దిగి 19 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
అయితే ఉషశ్రీ అంతకముందు టీడీపీలోనే పనిచేశారు. కానీ అనూహ్యంగా వైసీపీలోకి వచ్చి సీటు దక్కించుకుని 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. ఇక ఉష విజయం....కేవలం జగన్ ఇమేజ్ మీద ఆధారపడి వచ్చిందనే చెప్పాలి. అలా జగన్ వేవ్‌లో గెలిచిన ఉషశ్రీ తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు....కానీ అనుకున్న రీతిలో ప్రజలకు అండగా ఉండటంతో ఉషశ్రీ విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు వేగంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది.


గత ఎన్నికల్లో చంద్రబాబు....సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరీని కాదని, ఉమామహేశ్వర నాయుడుకు సీటు ఇచ్చారు. కానీ హనుమంతరాయ వర్గం సహకరించకపోవడం, జగన్ వేవ్, టీడీపీపై వ్యతిరేకతలో ఉమామహేశ్వర ఓటమి పాలయ్యారు. కానీ ఓడిపోయాక సైలెంట్ అవ్వలేదు...పార్టీ కోసం ఫైట్ చేస్తూనే వస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ తరుపున ప్రజా పోరాటాలు చేస్తూ, ప్రజా సమస్యలని హైలైట్ చేస్తూ, తాను తక్కువ సమయంలోనే ప్రజల్లోకి వెళ్లారు.


ఎలాగో కళ్యాణదుర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది....దీంతో ఓడిపోయినా సరే పార్టీ వేగంగా పికప్ అవ్వగలిగిందని చెప్పాలి...అటు వైసీపీలో అనుకున్న మేర పనులు జరగకపోవడం కూడా బాగా ప్లస్ అవుతుంది. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యే అద్భుతమైన పనితీరు కనబరిస్తే....కళ్యాణదుర్గం ప్రజలకు ఉమామహేశ్వర నాయుడు వైపు చూడాల్సిన అవసరం ఉండదు...కానీ ఇప్పుడు ఉమా వైపు చూస్తున్నారు....అంటే కళ్యాణదుర్గంలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లే అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: