రేవంత్ రెడ్డి :నిజాం పాలన తరహాలో కేసీఆర్ పాలన..!

MOHAN BABU
రజాకార్లను పెట్టి తన ప్రజల్ని ప్రేమగా పరిపాలించాల్సిన రాజు హింసించి,లొంగదీసుకొని, భయపెట్టి తన రాజ్యం మీద తిరుగుబాటు జరగకుండా అణచివేయడానికి ఖాసీం రిజ్వీ నేతృత్వంలో  రజాకార్లను, ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నిజాం నవాబు తెలంగాణ ప్రాంతంలో ప్రజల్ని అనిచివేశాడు. అయినా ఈ ప్రాంత ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒడిసెల లో రాళ్ళు పెట్టి కొట్టడమే కాదు కళ్లల్లో కారం చల్లి  ఆడబిడ్డలు కొంగు నడుంబిగించి నిజాం రాజ్యాలను, నిజాం ల పైజమాలు తడిచేటట్టు కొట్టారు. ఈ తెలంగాణ సమాజం మీద పెత్తనం చేసిన వాళ్ళను  ఉప్పెనలా కమ్ముకొచ్చి పాతాళానికి నెట్టారు.

తెలంగాణ చరిత్రలో ఈ స్ఫూర్తిని ఇవాళ జరుగుతున్న పరిణామాలకు మీరు ఒకసారి ఆలోచన చేయండి అని రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ గారు నిజాం నవాబ్ అయితే కాశీం రిజ్వీ హరీష్ రావు. ఆనాడు లొంగతీసుకోవడానికి, భయపెట్టడానికి ,తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే నిజాం నవాబు ఖాసీం రిజ్విని పెట్టి అణిచి వేసిండో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తన పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని, ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నిజాం నవాబు లాంటి కేసీఆర్ ఇవాళ ఖాసీం రిజ్వి లాంటి హరీష్ రావు గారిని పంపించి హుజు రాబాద్ లో ప్రతి ఒక్కరిని సీడ్ అమ్ముకొనే వాళ్లను, ఫీల్డ్ అసిస్టెంట్  లను, ఆర్ఎంపీ డాక్టర్ లను, బిఎంపి డాక్టర్లను, ట్రాఫిక్ పోలీసుల మీద, చిన్న చిన్న ఊర్లో ఇల్లు కట్టుకునేందుకు ఇసుక పోసే వాళ్ళని, భూముల్లో రెవెన్యూ వాళ్లతోని, అన్నదమ్ముల పంచాయతీ భార్య భర్తల పంచాయతీలో మధ్యలో దూరి భార్యాభర్తలకు పంచాయతీ పెట్టించి, కుటుంబంలో చిచ్చు పెట్టి భయపెట్టి ఇవాళ టిఆర్ఎస్ గెలవాలని చూస్తుంది. చిల్లర, అత్యంత దిగజారుడు,నీచమైన పరిస్థితులు హుజరాబాద్ లో కనిపించడానికి హరీష్ రావు గారే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.

 చిల్లర రాజకీయాలకు తెరలేపి ఆనాటి ఖాసీం రిజ్వి ని మరిపిస్తున్నారు హరీష్ రావు. ఈ విషయాన్ని మీకు తెలుసు కదా అని మీడియా వాళ్లను ప్రశ్నించారు. రాజ్యం కోల్పోయి, రాజ్యాన్ని మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో కలసిపోయే సందర్భంలో నిజాంకు ఏ పరిస్థితులు అయితే ఉండేనో ఈరోజు కెసిఆర్ కి కూడా అధికారం దిగిపోయే ముందు అలాంటి పరిస్థితులే వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: