గల్లా సైడ్ అయ్యారా... మిస్ అయ్యారా...?

VUYYURU SUBHASH
రాష్ట్రంలో ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఓ రేంజ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది...మొన్నటివరకు మాటల యుద్ధం చేసుకునేవారు....కానీ ఇప్పుడు ఆ స్టేజ్ దాటేసింది....డైరక్ట్ దాడులు చేసుకునే పరిస్తితి వచ్చేసింది. అయితే అధికార వైసీపీ ఇందులో బాగా ముందుంది...ఎలాగైతే బూతుల దాడి మొదట మొదలుపెట్టింది....ఇప్పుడు చేతల యుద్ధం కూడా మొదలుపెట్టేసింది.
అయితే వైసీపీని డిఫెండ్ చేసుకునేందుకు టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. ప్రతిపక్షంలో ఉండటంతో టీడీపీకి ఏంది అనుకూలంగా లేదు. కాకపోతే కార్యకర్తల సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఇక ఈ దాడుల తర్వాత నాయకులు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. ఎప్పుడూలేని విధంగా నాయకులు పార్టీకి అండగా నిలబడ్డారు. అందుకే వైసీపీని కాస్త అయినా నిలువరించగలిగారు. కానీ ఇంత రచ్చలో కూడా కొందరు టీడీపీ నాయకులు బయట కనబడలేదు...పార్టీకి కనీసం అండగా నిలబడలేదు.
పలువురు నాయకులు మీడియాకొచ్చి కనీసం ఖండిస్తున్నట్లు కూడా చెప్పలేదు. ముఖ్యంగా కర్నూలులో సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీలు అసలు కనిపించలేదు. దాదాపు అందరూ నాయకులు బయటకొచ్చి అధినేతకు అండగా నిలబడ్డారు. కానీ వారు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ ఏమైపోయారో కూడా క్లారిటీ లేదు.
అసలు రారు అనుకున్న ఎంపీ కేశినేని నాని...చంద్రబాబు 36 గంటల దీక్షకు వచ్చి మద్ధతుగా నిలబడ్డారు. కానీ గల్లా కనబడలేదు. పైగా తన గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉండే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యలయంపై దాడి జరిగింది. కనీసం దాడి ఘటనని ఖండించినట్లు ప్రకటన కూడా రాలేదు. ఒకవేళ గల్లా స్థానికంగా అందుబాటులో లేరని అనుకుంటే...సోషల్ మీడియాలో అయినా వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్లు ఒక పోస్టు కూడా పెట్టలేదు. దీని బట్టి చూస్తే గల్లా టీడీపీలో సైడ్ అయిపోయారా లేక కొన్ని రోజులు మిస్ అవుతున్నారో అర్ధం కాకుండా ఉంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: