పరిటాల సునీతకు వల్లభనేని వంశీ సవాల్..!

Podili Ravindranath
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే సవాళ్ల పర్వం నడుస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్న అధికార, ప్రతిపక్ష నేతలు.... నీ సంగతి తేలుస్తామంటున్నా నాయకులు... కేసులు... ఆరోపణలు... ప్రత్యారోపణలు.. ఇలా ఎక్కడ చూసినా ఇదే సీన్. అది రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అనేది ఏం లేదు. సవాల్ విసురుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఈ సవాళ్ల పర్వం తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడంతో వివాదం వేరే లెవల్‌కి చేరుకుంది. టీడీపీ అధినేత దీక్షలు, వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలు. అంతటితో ఆగకుండా... ఇరు పార్టీల నేతలు చేసుకున్నా వాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కుప్పం వస్తే చంద్రబాబు కారుపై బాంబులు వేస్తామనేశారు వైసీపీ నేతలు. మరికొందరైతే.. టీడీపీ గుర్తింపు రద్దుకే ప్రయత్నిస్తామన్నారు.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గట్టి సవాల్ విసిరారు. చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలన్న పరిటాల సునీత.. తామేమిటో వైసీపీ నేతలకు చూపిస్తామంటూ కామెంట్ చేశారు. మెత్తగా ఉంటే.. ప్రస్తుతం సరిపోదన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని ఓడిపోవడం ఖాయమన్నారు. దీనికి వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. గతంలో పరిటాల రవితో సన్నిహిత సంబంధాలున్న వల్లభనేని వంశీ... ఎన్నో సందర్భాల్లో సునీత, శ్రీరామ్‌లకు మద్దతుగా కామెంట్ కూడా చేశారు. సునీత వ్యాఖ్యలకు కౌంటర్‌గా లోకేష్ గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గెలవాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకూ... ఇప్పుడే రాజీనమా చేస్తున్నా... పోటీకి రెడీనా అని ఛాలెంజ్ చేశారు. లోకేష్‌ను గన్నవరం నుంచి గెలిపించగలరా అని సవాల్ చేశారు. మీడియా ఎందురుగా ఖాళీ లెటర్ హెడ్ పైన సంతకం కూడా చేశారు వంశీ. నేను రెడీ... మరి మీరు కూడా రెడీనా... నన్ను ఓడించగలరా... లోకేష్‌ను గెలిపించగలరా.... అని ఛాలెంజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: