ఇక్కడ తెరాస ఓటమికి ఇతను కారకుడవుతాడా..కారణం..!

MOHAN BABU
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాస పార్టీ ఓడిపోతే ఈ అభ్యర్థి కొంత కారణం అవుతాడు అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అభ్యర్థి ప్రచారం చేయకుండానే  ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సాధిస్తున్నాడు . ఇది ఎలా జరుగుతుంది.. ప్రచారం చేయకుండా ఓటు ఎలా సంపాదిస్తున్నాడు.. అదే తెలుసుకుందాం..? తెలంగాణ సీఎం గులాబీ బాస్ వ్యక్తిగత ఇమేజ్ కు సవాలుగా తీసుకున్నటువంటి హుజురాబాద్ ఉప ఎన్నిక తెరాస పాలిట  ఇబ్బందికరంగా మారింది.. అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మరో వ్యక్తి సిరివేరు శ్రీకాంత్ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండటంతో ప్రతీసారి టిఆర్ఎస్ కు దెబ్బ పడుతోంది.

ఇదే రకంగా దుబ్బాకలో కూడా  పోటీ చేసి అదే రోలింగ్ గుర్తును సాధించుకున్న ప్రజా ఏక్తా పార్టీకి చెందిన అభ్యర్థి శ్రీకాంత్ చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఆయన గడిచిన మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి ఆరు ఎన్నికలలో పోటీ చేసాడు. జరగబోయేటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని అంటున్నాడు. దేశంలో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన ఇటువంటి విధానాలు తనకు నచ్చకనే శ్రీకాంత్ పోటీ చేస్తున్నాడని కనీసం ప్రచారం నిర్వహించకుండానే ఓట్లు పొందుతున్నారని  అంటున్నాడు.
 జమ్మికుంటకు చెందినటువంటి సిరివేరు శ్రీకాంత్ ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థి అయిన వ్యక్తికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా శ్రీకాంత్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీలో ఉండి ఇలాంటి ప్రచారం నిర్వహించకుండానే ఓట్లను కొల్లగొట్టాడు.  ఆయనకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఆరవది. అయితే 2019 సంవత్సరంలో కరీంనగర్లోని ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి 6810 ఓట్లు, 2019 హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి 585 ఓట్లు, 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో నిలబడి 595 ఓట్లు, అలాగే నాగార్జునసాగర్ ఎన్నికల్లో  56 ఓట్లు  సాధించారు. ప్రస్తుతం ఆయన హుజురాబాద్ లో  ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికల కమిషన్ తో గొడవకు దిగి మరి  రోలింగ్ ఫిన్ గుర్తు సాధించాడు. ఇలా కారు గుర్తును పోలినటువంటి  గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించరాదని వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘంతో టీఆర్ఎస్ గట్టి పోరాటానికి దిగింది. కానీ ఎన్నికల సంఘం తెరాస అభ్యర్థనను పట్టించుకోలేదు. మళ్లీ హుజురాబాద్ లో అతనికి గుర్తు కేటాయించడం వలన టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు.

ఎందుకంటే  గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో  హోరాహోరీగా సాగిన పోటీలో  బిజెపి కేవలం 1000 ఓట్ల తేడాతోనే విజయం సాధించింది. కారు గుర్తును పోలిన ఉన్నటువంటి వ్యక్తి  చపాతీ రోలర్ గుర్తుకు 3580 ఓట్లు పడ్డాయి. ఇవి పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ ఓట్లని దీనివలన దుబ్బాకలో అపజయం పాలు అయిందని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: