గంగా స్నానం.. తుంగ పాణం.. తుంగభద్ర వ్యర్థాలతో నిండిపోయిందా..!

MOHAN BABU
గంగా స్నానం తుంగా పానం అనేది నానుడి. గంగానదిలో స్నానం చేసినా, తుంగభద్ర జలం  తాగిన ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో ఉన్నది ఒకప్పుడు నిజమేమో కానీ  ఇప్పుడు తుంగ భద్రా జలం తాగితే సకల రోగాలు రావడం ఖాయం. కర్నూలు జిల్లాలోని ప్రజలు విడుదల చేసే వ్యర్థ జలాలు నదిలో కలిసి విషాన్ని చిమ్ముతున్నాయి . ఒక్క మాటలో చెప్పాలంటే తుంగభద్రా నది ఒక పెద్ద డ్రైనేజీ గా మారింది. పవిత్రమైన తుంగభద్ర నది, లక్షల ఎకరాలకు సాగునిరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తోంది.

అయితే ప్రస్తుతం తుంగభద్ర నది లోకి విష పదార్థాలు వదులుతున్నారు. కర్నూలు నగరం నుంచి వెలువడుతున్న మురుగునీరు నదిలో కలవడంతో కలుషితమవుతోంది. ప్రతిరోజు 22 మిలియన్ లీటర్ల మురుగునీరు తుంగభద్ర లో కలుస్తుంది. 100 లీటర్ల నీటిలో కొలి బ్యాక్టీరియా 500 నుంచి 600 సి ఎఫ్ యు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 1100 నుంచి 1200 ఉన్నట్లు నిర్ధారించారు. మురుగునీరు కలుస్తున్న చోట  అమ్మోనీకల్ నైట్రోజెన్ 22 నుంచి 330 వరకు ఉంది. ప్రమాణాల ప్రకారం బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటర్ కు 30 mg ఉండాలి. నదిలో 50 నుంచి 60 mg మధ్య ఉన్నట్లు తేలింది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు లేకపోవడమే కాలుష్యం పెరగడానికి కారణమనే విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ తగినన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయింది.

ప్రస్తుతం తుంగభద్ర నది వెంట మూడు మాత్రమే మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. అందులో మహా అయితే రెండున్నర మిలియన్ల మురికినీరు మాత్రమే శుద్ధి అవుతుంది. తుంగభద్ర నది కాలుష్యన్ని త్వరిత్తగతిన నివారించకపోతే జనం ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు  మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి నది పవిత్రతను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: