బాబుకు రెడ్డి నేతల సపోర్ట్...బాగానే కష్టపడుతున్నారు...

M N Amaleswara rao
రాష్ట్రంలో రెండు సామాజికవర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు, మూడు దశాబ్దాల కాలం నుంచి కమ్మ, రెడ్డి వర్గాల మధ్యే అధికారం ఉంటుంది. టి‌డి‌పి అధికారంలో ఉంటే కమ్మ, కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్డి వర్గానిదే హవా. కాంగ్రెస్ పోయాక రెడ్డి వర్గం వైసీపీ వైపు ఉంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి రాజకీయం రెడ్డి వర్గం చేతుల్లోనే ఉంది.
అయితే టి‌డి‌పిలో రెడ్డి వర్గం నేతలు లేరని కాదు....అటు వైసీపీలో కమ్మ నేతలు లేరని కాదు. టి‌డి‌పిలో ఉన్న రెడ్డి వర్గం నేతలు చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారు. సొంత వర్గం కమ్మ నేతలకంటే రెడ్డి నేతలే బాబుకు బాగా సపోర్ట్ ఇస్తారు. అటు వైసీపీలో కూడా కమ్మ వర్గం నాయకుల సపోర్ట్ జగన్‌కు ఎక్కువ. ఉదాహరణకు కొడాలి నాని. ఆయన ఏ రేంజ్‌లో జగన్‌కు సపోర్ట్ ఉంటారో చెప్పాల్సిన పని లేదు.
ఇక టి‌డి‌పిలో చాలామంది రెడ్డి నేతలు బాబు కోసం కష్టపడుతున్నారు. పార్టీ ఘోరంగా ఓడిపోయాక అదే కమ్మ వర్గం నాయకులు చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చారు గానీ, రెడ్డి వర్గం నేతలు హ్యాండ్ ఇవ్వలేదు. ఇతర వర్గాల నేతలు బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లారు గానీ, బాబు కోసం నిలబడే రెడ్డి నేతలు పార్టీ మారలేదు. ముఖ్యంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి నాయకులు. సోమిరెడ్డి అయితే మొదట నుంచి బాబుకు అండగా ఉంటూనే వస్తున్నారు.


అటు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఫ్యామిలీ సైతం బాబు కోసం నిలబడుతూ వస్తుంది. అలాగే శ్రీనివాసులు రెడ్డి, మల్లెల లింగారెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి లాంటి నాయకులు పార్టీ కోసం కష్టపడే నాయకులు. ఇక జే‌సి ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ టి‌డి‌పితోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబుకు రెడ్డి వర్గం నేతల మద్ధతు బాగానే ఉందని చెప్పుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: