ఎదుగుతున్న మహిళలే వారి లక్ష్యం.. కెన్యాలో దారుణం?

praveen
టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతోంది. మనిషి నాగరిక సమాజంలోకి అడుగుపెడుతున్నాడు.  మనిషి ఆలోచనలో కూడా పరిపక్వత వస్తుంది అని అందరూ చెబుతున్నారు. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనిషి ఆలోచనా తీరులో పరిపక్వత రావడం ఏమో కానీ రోజురోజుకు అనాగరిక ఆలోచనలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు అన్నది మాత్రం అర్థమవుతోంది. ముఖ్యంగా మహిళల పట్ల నేటి సమాజంలో ఇప్పటికీ కూడా చిన్న చూపే ఉండడం గమనార్హం. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడం హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు నేటి రోజులలో.

 అయితే మహిళలు అందరూ పురుషులతో సమానంగా సాధికారత సాధించే వైపుగా అడుగులు వేస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయడం లేదు. కానీ అటు మహిళలను వెనక్కి లాగడానికి ఎంతోమంది ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  దీంతో ఆడపిల్ల రక్షణ  రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే కెన్యాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడ పిల్లల సాధికారత వైపు అడుగులు వేస్తున్న వారే లక్ష్యంగా ఎంతోమంది దుర్మార్గులు దారుణాలకు పాల్పడుతున్నారు.

 కెన్యాలో ఏకంగా ఇద్దరు అథ్లెట్స్ ను దారుణం గా అత్యాచారం చేసి హత్య చేసి చంపిన ఘటన సంచలనం గా మారి పోయింది. ఆడపిల్లల ఎదుగుదలను అంగీకరించలేక  పైశాచికంగా ప్రవర్తిస్తూ దారుణంగా ప్రాణాలు తీసేయడం చేస్తున్నారూ. సింతీయ మల్కొహ (18) అనే ఒక వాలీబాల్ ప్లేయర్ ని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆగ్నేస్ ట్రాప్ అనే 25 ఏళ్ల మరో అథ్లెట్ను కూడా దారుణంగా హత్య చేశారు. ఈమె ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ ఏకంగా 400 మీటర్ల పరుగును పూర్తిచేసింది. ఇలా ఆడ పిల్లల ఎదుగుదలను చూడలేక కెన్యా లో దారుణం గా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: