జగన్ క్యాబినెట్ లో ఉండేది ఎవరు.. ఊడేది ఎవరు..?

MOHAN BABU
ఏపీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. జగన్ క్యాబినెట్ లో ఎవరు ఉంటారు. ఎవరు పదవిని కోల్పోతారు. నిజానికి వైసిపి సర్కా ఏర్పడినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని జగన్ స్పష్టం చేశారు. మంత్రివర్గంలో 80% మార్పులు ఉంటాయని కొందరు, 90% అని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరొకవైపు ఆశావాహులు జగన్ నుంచి హామీలున్నవారు పదవుల కోసం పోరాడుతున్నారు. మంత్రివర్గంలో వందశాతం మార్పులు ఉంటాయని  మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త క్యాబినెట్ తోనే 2024 ఎన్నికలకు జగన్ వెళ్ళబోతున్నారా. జగన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని బొత్స సత్యనారాయణ కూడా అన్నారంటే ప్రస్తుతం మంత్రులందరూ మానసికంగా సిద్ధమయినట్టేనా? సీనియర్లు కొందరు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సే లేదా?

 సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా క్యాబినెట్ మార్పులు ఉంటయా? మంత్రివర్గ మార్పు గురించి గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో 25 మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం. విజయనగరం జిల్లాలో రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి. విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, ముత్యాల నాయుడు. తూర్పు గోదావరి జిల్లాలో దాడిశెట్టి రాజా, జగ్గంపూడి రాజా, పొన్నాల సతీష్, కొండేటి చిట్టిబాబు. పశ్చిమగోదావరి జిల్లాలో గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు, బాలరాజు, తల్లారి వెంకట్రావు. కృష్ణాజిల్లాలో జోగి రమేష్, పార్థసారథి, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను. గుంటూరు జిల్లాలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, విడుదల రజిని, మర్రి రాజశేఖర్, ముస్తఫా. ప్రకాశం జిల్లాలో మద్దిశెట్టి వేణుగోపాల్ రావు, సుధాకర్ బాబు, అన్నా రాంబాబు.

 నెల్లూరు జిల్లాలో  కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లాలో రోజా, గోమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కడప జిల్లాలో కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి. అనంతపురం జిల్లాలో కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఉష శ్రీ చరణ్. కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, ఆర్థర్ , బాల నాగిరెడ్డి. రెండున్నరేళ్లే అవకాశమని జగన్ ముందుగానే క్లియర్ గా చెప్పేశారు. ఆ సమయం కాస్తా సన్నగించింది. జగన్ అయితే మాట తప్పారు మడమ తిప్పారు. దీంతో జూనియర్లే కాదు సీనియర్ మంత్రులను టెన్షన్ కలిగింది. వంద శాతం మార్పులు ఉంటాయని జగన్ నుంచి సంకేతాలు రావడంతో రోజులు లెక్కపెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: